ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల కోతలపై పెరుగుతున్న అంచనాలు, నిరంతర ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అలాగే కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య 2026 లోకి అడుగుపెడుతున్నాం. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారుల దృష్టి మళ్లీ వస్తువుల (కమోడిటీస్) వైపు వెళుతోంది. ముఖ్యంగా బంగారం, వెండి, రాగి వంటి విలువైన, మూల లోహాలు పెట్టుబడిదారుల పోర్ట్‌ఫోలియోలో కీలక స్థానాన్ని సంపాదిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచం మరోసారి మెటల్ సూపర్ సైకిల్ యొక్క తదుపరి ప్రధాన దశలోకి అడుగుపెడుతోందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈసారి చర్చ కేవలం బంగారం ఎంత ఎత్తుకు చేరుతుందనే దానికే పరిమితం కాదు. వెండి మరోసారి బంగారాన్ని మించిపోయే ప్రదర్శన ఇస్తుందా? అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), కృత్రిమ మేధస్సు (AI), గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల నుండి పెరుగుతున్న డిమాండ్‌తో రాగి ప్రపంచ ఆర్థిక వృద్ధికి సూచికగా తన పాత్రను తిరిగి పొందగలదా? అనే ప్రశ్నలు ఇప్పుడు కీలకంగా మారాయి. బంగారం విషయానికి వస్తే.. ఇది ఇకపై కేవలం సురక్షిత పెట్టుబడి సాధనంగా మాత్రమే కాకుండా, కేంద్ర బ్యాంకుల వ్యూహాత్మక ఆస్తిగా కూడా మారిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చైనా వంటి దేశాలు దూకుడుగా Gold కొనుగోలు చేస్తుండటం ధరలకు దీర్ఘకాలిక మద్దతునిస్తోంది.

కేడియా ఫిన్‌క్యాప్ వ్యవస్థాపకుడు నితిన్ కేడియా మాట్లాడుతూ.. 2026 మొదటి త్రైమాసికంలో కూడా బంగారం నా ప్రాధాన్య పెట్టుబడిగానే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల కోతలు వేగవంతమైతే, భౌగోళిక రాజకీయ ప్రమాదాలు కొనసాగితే, బంగారం మరింత లాభపడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
వెండి బలమైన ప్రద్శరక కనబరుస్తోంది. పెట్టుబడి డిమాండ్‌తో పాటు పారిశ్రామిక వినియోగం కలిసి వెండికి బలమైన మద్దతు ఇస్తున్నాయి. 1979 తర్వాత అత్యంత బలమైన ర్యాలీని వెండి నమోదు చేసిందని అర్మానీ డైరెక్టర్ తరుణ్ సత్సంగి తెలిపారు. 2025లో సుమారు 200 మిలియన్ ఔన్సులుగా ఉన్న సరఫరా లోటు, 2026లో 280 నుంచి 300 మిలియన్ ఔన్సులకు పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఇది వరుసగా ఆరో సంవత్సరం వెండి కొరత కొనసాగుతుందనే సంకేతం.
సౌర ఫలకాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, విద్యుత్ మౌలిక సదుపాయాల వంటి రంగాల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుంటే.. వెండి నిర్మాణాత్మక వృద్ధి కథ చాలా బలంగా ఉందని సత్సంగి తెలిపారు. ఇక కమోడిటీస్ నిపుణుడు అంకిత్ కపూర్ ప్రకారం.. వెండి కీలక నిరోధక స్థాయిలను అధిగమించడం బహుళ దశాబ్దాల సాంకేతిక బ్రేక్‌అవుట్‌ను సూచిస్తోంది. మధ్యకాలంలో వెండి ధరలు డాలర్ 90-100 వరకు, దీర్ఘకాలంలో 2030-2032 నాటికి డాలర్ 150-180 వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇక రాగి విషయానికి వస్తే.. ప్రపంచ శక్తి పరివర్తనలో ఇది కీలక లోహంగా కొనసాగుతోంది. EVలు, AI డేటా సెంటర్లు, పునరుత్పాదక విద్యుత్ గ్రిడ్‌లు, విస్తృత విద్యుదీకరణ వల్ల రాగికి నిర్మాణాత్మక డిమాండ్ పెరుగుతోంది. అయితే సరఫరా పరిమితులు, గనుల గ్రేడ్‌లు తగ్గడం వంటి అంశాలు మార్కెట్‌ను కఠినతరం చేస్తున్నాయి. పారాడిగ్మ్ కమోడిటీస్‌కు చెందిన బిరెన్ వకీల్ ప్రకారం..రాబోయే త్రైమాసికాల్లో LMEలో రాగి ధర USD 13,500 నుంచి USD 14,050 మధ్య ఉండే అవకాశం ఉంది.
అయితే కొన్ని మంది నిపుణులు అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుత ధరల వద్ద దూకుడుగా కొనుగోళ్లు చేయడం కంటే ఓపికతో, దశలవారీ పెట్టుబడులే మంచివని సూచిస్తున్నారు. స్వల్పకాలిక అస్థిరత, లాభాల బుకింగ్ ఉండొచ్చని అంచనా ఉన్నప్పటికీ, 2026లో లోహాల మార్కెట్‌లో పెద్ద పతనం జరిగే అవకాశం తక్కువేనని ఎక్కువ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.



Click it and Unblock the Notifications