స్టాక్ మార్కెట్‌ను కూలదోసిన బంగారం..ఈ ఏడాది పెట్టుబడిదారులకు అత్యధిక లాభాలు పసిడి నుంచే..
ఈ సంవత్సరం బంగారం స్టాక్ మార్కెట్ ని తలదన్ని విజేతగా నిలిచింది. దీపావళి నుండి దీపావళి వరకు అంటే ఏడాది కాలంలో, బంగారం రాబడులు ఈక్విటీలను వరుసగా నాలుగోసారి అధిగమించాయి. గత ఎనిమిది సంవత్సరాల్లో ఏకంగా ఏడు సార్లు బంగారం ఈక్విటీల కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ ధోరణి ఇంకా కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. గత దీపావళి నుంచి MCX Gold ధరలు 40 శాతం పెరిగాయి. అదే సమయంలో నిఫ్టీ 50 సూచీ కేవలం 5 శాతం పెరిగింది.
2024లో మాత్రమే బంగారం 32 శాతం రాబడులు ఇచ్చింది, నిఫ్టీ 24% పెరిగింది. 2023లో Gold 21 శాతం పెరిగితే, నిఫ్టీ 10 శాతం పెరిగింది. విస్తరించిన వాల్యుయేషన్లు, నిదానంగా పెరుగుతున్న కార్పొరేట్ లాభాలు, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాల ఒత్తిడి, సుంకాలు, భౌగోళిక ఉద్రిక్తతలు.. ఇవన్నీ ఈక్విటీలను బలహీనపరిచాయి. ఫలితంగా, పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు.

తాజా బులియన్ ర్యాలీకి అనేక అంశాలు కారణాలుగా చెప్పుకోవచ్చు. US ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశంతో పాటుగా కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచడం ప్రధాన కారణమయితే.. అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు కూడా కారణాలుగా చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన ఆస్తిగా భావించి కొనుగోలు చేస్తున్నారు.
క్లయింట్ అసోసియేట్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అభిషేక్ ఖుదానియా మాట్లాడుతూ..ప్రస్తుత ఆర్థిక వాతావరణంలో ఈక్విటీలు కొంత రికవర్ అవుతున్నా, బంగారం రాబడులు మరో ఏడాది పాటు పైచేయి సాధించే అవకాశం ఉందని అన్నారు. అదే సమయంలో చాయిస్ బ్రోకింగ్ విశ్లేషకుడు అమీర్ మక్డా పేర్కొంటూ భౌగోళిక రాజకీయాలు కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. వాణిజ్య సంబంధిత వివాదాలు, భద్రతా ఉద్రిక్తతలు మార్కెట్లపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో బంగారం పెట్టుబడిదారులకో రక్షణ వలె పనిచేస్తుందని తెలిపారు.
గోల్డ్‌మన్ సాచ్స్ అంచనా ప్రకారం.. పెట్టుబడిదారులు తమ ట్రెజరీ హోల్డింగ్స్‌లో కొంత భాగాన్ని బంగారంగా మార్చితే, బులియన్ ధరలు ఔన్స్‌కు 5 వేల డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉంది. జెఫరీస్ గ్లోబల్ స్ట్రాటజీ హెడ్ క్రిస్ వుడ్ తన దీర్ఘకాల అంచనాను 6,600/oz డాలర్లకి పెంచారు. ఇప్పటికే ఈ వారం బంగారం 3,700/oz డాలర్లు అనే రికార్డు స్థాయిని తాకింది. ఫెడ్ విధానంలో మార్పులు లేకపోవడంతో ఈ బలమైన ర్యాలీ కొనసాగుతుందని నిపుణులు భావిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications