బంగారం ధరలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎప్పుడు రేట్లు ఎలా మారుతాయో అంతు చిక్కడం లేదు. జనవరి నెలలో ధరలు నింగిని తాకి పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించగా ఫిబ్రవరి నెల వచ్చేసరికి నేల చూపులు చూశాయి.సామాన్యుడు కొనుగోలు చేయాలంటే భయపడే పరిస్థితి నుంచి ఊరట చెందాడు. అయితే మళ్లీ ధరలు పెరగడం స్టార్ట్ అయ్యాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు బంగారం ధరను మళ్లీ పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఈ వారం బంగారం మార్కెట్‌పై పెట్టుబడిదారుల దృష్టి మరింత కేంద్రీకృతమైంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం.. బంగారం ధరలు బలంగా ట్రేడయ్యే అవకాశం ఉండగా, వెండి ధరలు మాత్రం తీవ్ర అస్థిరతను ఎదుర్కొనవచ్చు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ముఖ్యంగా అమెరికా నుంచి వచ్చే కీలక స్థూల ఆర్థిక డేటా, ఈ వారం బులియన్ మార్కెట్ దిశను నిర్ణయించనుంది.

మార్కెట్ వర్గాల ప్రకారం.. అమెరికా ద్రవ్యోల్బణం, GDP వృద్ధి రేటు, PMI గణాంకాలు, అలాగే వ్యవసాయేతర జీతాల (Non-Farm Payrolls) డేటాపై పెట్టుబడిదారులు నిశితంగా దృష్టి సారిస్తున్నారు. ఈ గణాంకాలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ భవిష్యత్ వడ్డీ రేటు విధానంపై కీలక సంకేతాలను అందించే అవకాశం ఉంది. వడ్డీ రేటు తగ్గింపులు ఎప్పుడు ప్రారంభమవుతాయనే అంశం Gold ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది.
అంతేకాకుండా.. చైనా, జర్మనీ, భారతదేశం నుంచి విడుదలయ్యే ద్రవ్యోల్బణ గణాంకాలు కూడా మార్కెట్ భావోద్వేగాలను ప్రభావితం చేయనున్నాయి. ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఈ డేటా ఇచ్చే స్పష్టత, పెట్టుబడిదారుల రిస్క్ ఆకాంక్షను నిర్ణయించనుంది. పిటిఐ నివేదిక ప్రకారం.. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ అధికారుల ప్రసంగాలను కూడా మార్కెట్ జాగ్రత్తగా విశ్లేషించనుంది. ఎందుకంటే అవి వడ్డీ రేటు తగ్గింపు సమయంపై మరింత స్పష్టత ఇవ్వవచ్చు.
జెఎం ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన ప్రణవ్ మెర్ మాట్లాడుతూ.. Gold మార్కెట్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న ఏకీకరణ (Consolidation), పునరుద్ధరణ ధోరణి సానుకూలంగా ఉందని తెలిపారు. అయితే, వెండి విషయంలో మాత్రం ఆయన జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. వెండి ధరలు ఇంకా అస్థిరంగా కొనసాగవచ్చని, దిద్దుబాటు (Correction) ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
గత వారం గణాంకాలు చూస్తే.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం బలమైన ప్రదర్శన చూపింది. బంగారం ఫ్యూచర్స్ ధరలు ఒకే వారం లోపే రూ.7,698 లేదా 5.2 శాతం పెరిగాయి. దీనికి భిన్నంగా వెండి ధరలు రూ. 15,760 లేదా దాదాపు 6 శాతం తగ్గాయి. ఇది వెండి మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడిని సూచిస్తోంది.ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన కారణంగా.. ఆ రోజు కమోడిటీ మార్కెట్లు తెరిచి ఉండటం కూడా ట్రేడింగ్ వాల్యూమ్‌ను ప్రభావితం చేసింది.
మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన మానవ్ మోడీ అభిప్రాయం ప్రకారం.. బంగారం, వెండి రెండూ గత వారం అత్యంత అస్థిర పరిస్థితులను ఎదుర్కొన్నాయి. డాలర్ బలపడటం, యుఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేటు అంచనాల్లో మార్పులు, అలాగే గతంలో ఉన్న దూకుడు వైఖరిని కొంత సడలించడం వంటివి మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం చూపాయి. అదేవిధంగా వాషింగ్టన్-టెహ్రాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, సుంకాల చర్చల్లో పురోగతి, అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ప్రమాదం తగ్గడం వల్ల సురక్షిత పెట్టుబడి (Safe Haven) డిమాండ్ బలహీనపడింది.
అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే.. COMEXలో బంగారం ధరలు ఒక వారంలో 234.7 డాలర్లు లేదా దాదాపు 5 శాతం పెరిగి ఔన్సుకు 5,000 డాలర్ల స్థాయికి చేరాయి. అదే సమయంలో వెండి ఫ్యూచర్స్ ధరలు 1.63 డాలర్లు లేదా 2.08 శాతం తగ్గాయి. కాల్ ఆప్షన్ పొజిషనింగ్, మార్జిన్ కాల్స్, ఊహాజనిత అమ్మకాలు వెండి ధరలపై అదనపు ఒత్తిడిని కలిగించాయి.
క్లుప్తంగా చెప్పాలంటే ఈ వారం ఫెడ్ ప్రకటనలు, కీలక స్థూల ఆర్థిక డేటా బంగారం-వెండి మార్కెట్ల దిశను నిర్ణయించనున్నాయి. బంగారం బలంగా నిలబడే అవకాశాలు ఉన్నప్పటికీ, వెండిలో మాత్రం అస్థిరత కొనసాగవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications