2026లో బంగారం ధరలపై గోల్డ్‌మన్ సాచ్స్ చేసిన అంచనాలు ప్రపంచ వ్యాప్తంగా పసిడి ప్రియులుకు భారీ షాక్ ఇస్తున్నాయి. ఇదే సమయంలో ఈ అంచనాలు పెట్టుబడిదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితులు, కేంద్ర బ్యాంకుల డిమాండ్ పెరుగుదల కలసి బంగారాన్ని చరిత్రలో ఎన్నడూ లేని గరిష్ట స్థాయికి తీసుకువెల్లగలవని అంచనా వేస్తోంది. ఈ నివేదిక ప్రకారం.. రాబోయే రెండు సంవత్సరాల్లో బంగారం ధరలు దాదాపు 50 శాతం పెరిగే అవకాశం ఉంది.
గోల్డ్‌మన్ సాచ్స్.. ఔన్సుకు బంగారం ధరను 5000 డాలర్లుగా అంచనా వేసింది. ప్రస్తుత మారకపు రేట్ల ప్రకారం ఇది భారతీయ కరెన్సీలో 10 గ్రాములకు దాదాపు రూ. లక్షా యాభై అయిదు వేలుగా ఉంటుంది. ప్రస్తుత స్థాయిలతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదలగా చెప్పుకోవచ్చు. ఈ అంచనాకు ప్రధాన కారణాలలో ఒకటి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకునే ద్రవ్య పరపతి నిర్ణయాలు. నివేదికలో పేర్కొన్నట్లుగా, ప్రైవేట్ యుఎస్ ట్రెజరీ హోల్డింగ్‌లలో కేవలం 1 శాతం కూడా బంగారంలోకి మారితే, అది బంగారం ధరలను 5000 డాలర్ల స్థాయికి తీసుకువెళుతుంది. ఆర్థిక అనిశ్చితి లేదా గ్లోబల్ రిస్క్ పెరిగినప్పుడల్లా పెట్టుబడిదారులు Gold ని మరింతగా ఆశ్రయించే అవకాశముందని గోల్డ్‌మన్ సాచ్స్ విశ్వసిస్తోంది.

ఈ నివేదికలో విభిన్న పరిస్థితుల ఆధారంగా బంగారం ధరల అంచనాలను కూడా సూచించారు. ప్రస్తుత ధోరణులు ఇదే విధంగా కొనసాగితే, 2026 మధ్య నాటికి ఔన్సుకు 4000 డాలర్లు (10 గ్రాములకు సుమారు రూ. 1,25,000) చేరవచ్చని, కానీ ఆర్థిక, భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు పెరిగితే ఔన్సుకు 4500 నుంచి 5000 డాలర్ల మధ్య చేరే అవకాశం ఉందని పేర్కొంది. ఇది బంగారాన్ని కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే కాదు, దేశాల కేంద్ర బ్యాంకులకు కూడా అత్యంత కీలకమైన ఆస్తిగా మార్చే అవకాశం ఉందని తెలిపింది.
గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ రిజర్వుల్లో బంగారం వాటాను పెంచుతున్నాయి. అదే సమయంలో ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతుండటంతో, పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలను వైవిధ్యీకరించి.. బంగారంలో నిధులను పెంచుతున్నారు. ఈ ట్రెండ్ బంగారం ధరలకు అదనపు మద్దతు ఇస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో కొంత ఒత్తిడి కనిపిస్తోంది. ఇటీవల రికార్డు స్థాయిలను చేరుకున్న బంగారం ధరలు గురువారం 1 శాతానికి పైగా వెనక్కి తగ్గాయి.ర్యాలీ తర్వాత లాభాలను బుక్ చేసుకోవడానికి పెట్టుబడిదారులు ముందుకు రావడం దీనికి ప్రదాన కారణంగా భావిస్తున్నారు. అయినప్పటికీ గోల్డ్‌మన్ సాచ్స్ అంచనాలు బంగారం మార్కెట్ భవిష్యత్తును అత్యంత బలంగా చూపుతున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఈ ఏడాది బంగారం, వెండి పెరుగుదలపై సంచలన నివేదిక.. ఏకంగా ఆ స్థాయి వరకు వెళుతుందంటున్న నిపుణులు..

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

భగ్గుమన్న బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంత వరకు వెళ్లిందంటే.. ఏప్రిల్ 8, బుధవారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..



Click it and Unblock the Notifications