అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఉదయం నుండి దుకాణాల వద్ద సందడి కనిపించింది. ఓ వైపు బంగారం ధరలు ఇటివలి కాలంలో భారీగా తగ్గడం, దీనికి తోడు అక్షయ తృతీయ రావడంతో పసిడి కొనుగోలుదారులు వరుస కట్టారు. కనీసం రూ.15,000 కోట్ల వ్యాపారం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. కరోనా ముందు నాటి 2019తో పోలిస్తే సేల్స్ 30 శాతం ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా ఉన్న సానుకూల సెంటిమెంట్ అక్షయ తృతీయ రోజున కూడా కొనసాగిందని చెబుతున్నారు.

కొనుగోళ్లకు రెండు కారణాలు
బంగారం ధరలు కొద్ది రోజుల క్రితం రూ.55,500 నుండి రూ.58,000 మధ్య కనిపించాయి. అయితే ఈ ధరలు ఇప్పుడు రూ.51,000 దిగువకు వచ్చాయి. దీంతో ఎన్నో రోజుల నుండి బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయాలని భావిస్తున్నవారికి గతవారం భారీ తగ్గుదల ఆనందాన్ని ఇచ్చింది. దీనికి తోడు అక్షయ తృతీయ పర్వదినం కలిసి వచ్చింది. అలాగే, పెళ్లిళ్ల సీజన్ తోడయింది. ఈ రెండు కలిసి నిన్న కొనుగోళ్లు భారీగా కనిపించాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు కొనుగోళ్లు కనిపించాయి. అయితే మధ్యాహ్నం ఎండల కారణంగా దుకాణాల్లో కాస్త జనాలు పలుచన అయ్యారు. కానీ సాయంత్రానికి గుమికూడారు.

ఆర్థిక రికవరీ
కరోనా తగ్గి, ఆర్థిక రికవరీ కనిపించిందని, అలాగే, అక్షయ తృతీయ నాడు పెద్ద స్టోర్లు దాదాపు రెండేళ్ల తర్వాత తెరుచుకున్నాయని, దీంతో ఆఫ్ లైన్ విక్రయాలు ఎక్కువగా జరిగాయి. ఆర్థిక రికవరీతో కొనుగోలు శక్తి పెరిగి, డిమాండ్ పెరిగిందని చెబుతున్నారు. ఆఫ్ లైన్‌తో పాటు ఆన్ లైన్ విక్రయాలు కూడా కనిపించాయి.

పెట్టుబడులు
ఈ అక్షయ తృతీయ రోజున అమ్మకాలకు పెట్టుబడుల డిమాండ్ కూడా దోహదం చేసింది. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, స్టాక్ మార్కెట్ ఊగిసలాటలు, ద్రవ్యోల్బణం పెరుగుదల, వడ్డీ రేట్ల పెంపు భయాలు మరింత దోహదపడ్డాయి. నగల కంటే గోల్డ్ బార్లు, గోల్డ్ కాయిన్స్ రూపంలో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది. కరోనా భయం లేకపోవడంతో అక్షయ తృతీయకు కొనుగోలు చేయాలను కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు వేచి చూడగా, విక్రయదారులు కొత్త డిజైన్లతో ముందుకు వచ్చారు.
More From GoodReturns

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications