For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold News: ధర తగ్గినా గోల్డ్ కు 'గిరాకి తగ్గుతోంది'.. దాని వల్లే పసిడికి దూరమౌతున్న ప్రజలు.. మీరు కొంటున్నారా.

|

Gold News: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్‌లో బంగారు ఆభరణాల డిమాండ్ ఐదు శాతం తగ్గి 550 టన్నులకు చేరుకోనుందని తాజా నివేదికలో తేలింది. కస్టమ్స్ సుంకాన్ని పెంచడమే ఇందుకు ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. జూన్ 30, 2022న బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచినట్లు రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ బుధవారం వెల్లడించింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారు ఆభరణాలను విక్రయించే రిటైల్ వ్యాపారుల ఆదాయ వృద్ధిపై అనిశ్చితి కొనసాగుతోంది.

కొనుగోలుదారులపై భారం..

కొనుగోలుదారులపై భారం..

ఈ కస్టమ్స్ సుంకం పెంపు భారాన్ని రిటైల్ వ్యాపారులు వినియోగదారులపై మోపనున్నారు. ఇది గిరాకీని తగ్గిస్తుంది. పైగా అధిక ధరలు విచక్షణతో కొనుగోలుదారుల నుంచి డిమాండ్ లేకుండా నిరోధిస్తుంది. కస్టమ్స్ సుంకం పెంపు వల్ల గోల్డ్ డిమాండ్ 550 టన్నులకు పరిమితం అవుతుందని నివేదిక వెల్లడించింది. ఏడాది క్రితం ఇదే కాలంలో పసిడి విక్రయాలు 580 టన్నులుగా ఉన్నాయి.

2021 ఫిబ్రవరిలో భారీ అమ్మకాలు..

2021 ఫిబ్రవరిలో భారీ అమ్మకాలు..

గత ఆర్థిక సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ లో మహమ్మారి కారణంగా ఏర్పడిన అంతరాయాలు ముగిసిన తర్వాత.. ఫిబ్రవరి, 2021లో అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. డిమాండ్ పెరగడం, దిగుమతి సుంకంలో ఐదు శాతం కోత విధించడంతో అప్పట్లో అధిక డిమాండ్ కు కారణంగా నిలిచింది. అధిక బంగారం ధరలు అమ్మకాల పరిమాణంలో నష్టాన్ని భర్తీ చేస్తాయని నివేదిక వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే పరిశ్రమ ఆదాయం స్థిరంగా ఉండేలా చూస్తుందని, కానీ.. నిర్వహణ లాభం మాత్రం ప్రభావితం అవుతుంది.

 అమ్మకాలు పెంచుకునేందుకు..

అమ్మకాలు పెంచుకునేందుకు..

దిగుమతి సుంకంతో బంగారం ధరలు పెరగడం వల్ల.. రిటైలర్లు తమ సేల్స్ పెంచుకునేందుకు కొత్త విక్రయ పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. అమ్మకాలను పెంచడానికి ప్రమోషనల్ స్కీమ్‌లను ప్రారంభించవచ్చని నివేదిక వెల్లడించింది.

Read more about: gold బంగారం
English summary

Gold News: ధర తగ్గినా గోల్డ్ కు 'గిరాకి తగ్గుతోంది'.. దాని వల్లే పసిడికి దూరమౌతున్న ప్రజలు.. మీరు కొంటున్నారా. | gold sales and demand may fall in this financial year

gold sales and demand may fall in this financial year amid increased import duty crisil report says..
Story first published: Thursday, July 21, 2022, 20:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X