టన్నుల కొద్ది బంగారాన్ని చైనా రహస్యంగా దాచుకుంటోంది.. ప్రపంచ బంగారు మండలి నుంచి షాకింగ్ రిపోర్ట్..
Gold Rush in China : భారత్ పొరుగుదేశం చైనాలో బంగారం గురించి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. డ్రాగన్ కంట్రీలో జూలై నెలలో బంగారు నిల్వలకు సంబంధించి ప్రపంచ బంగారు మండలి (World Gold Council) ఓ లేటెస్ట్ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో బంగారం ధరలు పెద్దగా పెరుగకపోయినా, మార్కెట్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపింది. US డాలర్లలో లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) బంగారం ధరలు కేవలం 0.3 శాతం మాత్రమే పెరిగాయి. అయితే చైనాలోని షాంఘై బెంచ్‌మార్క్ బంగారం ధరలు (SHAUPM) 0.5 శాతం పెరిగాయి. దీని వెనుక ముఖ్యకారణం డాలర్‌తో పోలిస్తే యువాన్ విలువ కొంచెం పడిపోవడమేనని WGC తెలిపింది.
ఈ సంవత్సరం మొదటినుంచి చూడగా యువాన్ విలువతో లెక్కించిన బంగారం ధరలు ఇప్పటికే 22 శాతానికి పైగా పెరిగాయి. అంతేకాదు, షాంఘై గోల్డ్ ఎక్స్చేంజ్ (SGE) నుండి బంగారం ఉపసంహరణలు కూడా పెరిగాయి. ఇన్వెస్టర్లు 93 టన్నులను ఉపసంహరించుకున్నారు. ఇది జూన్‌తో పోలిస్తే 3 టన్నులు ఎక్కువ. అయితే ఇప్పటికీ ఇది గత 10 సంవత్సరాల సగటు డిమాండ్ కన్నా తక్కువగా చెప్పుకోవచ్చు. దీనివల్ల దేశీయ గోల్డ్ ఆభరణాల విభాగంలో స్థిరమైన బలహీనత కొనసాగుతున్నట్టు స్పష్టమవుతోంది.
మరోవైపు.. చైనా గోల్డ్ ETFలు (ఎక్స్చేంజ్-ట్రేడెడ్ ఫండ్స్) జూలైలో 2.4 బిలియన్ RMB విలువైన ఫండ్లను ఇన్వెస్టర్లు బయటకు తరలించారు. స్థానిక స్టాక్ మార్కెట్ (CSI300) మంచి ర్యాలీ ఇవ్వడంతో చాలామంది బంగారం నుండి ఈక్విటీలకు మళ్లారు. దీంతో నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ 1శాతం తగ్గి RMB 151 బిలియన్లకు చేరింది. ఇక ETFల ద్వారా కలిగిన బంగారు హోల్డింగ్‌లు 3 టన్నులు తగ్గి 197 టన్నుల వద్దకు చేరుకున్నాయని ప్రపంచ బంగారు మండలి తెలిపింది.

అయితే బంగారంపై ఆసక్తి తగ్గుతున్నప్పటికీ.. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBOC)మాత్రం బంగారం కొనుగోళ్లను ఆపడం లేదు. జూలైలో మరో 2 టన్నుల బంగారాన్ని యాడ్ చేసుకున్నారు. ఈ బ్యాంక్ వరుసగా తొమ్మిదవ నెలలో కూడా బంగారం కొనుగోళ్లను ఆపలేదు. మొత్తంగా చూసుకుంటే చైనాకు ఉన్న బంగారం నిల్వలు ఇప్పుడు 2,300 టన్నులుకు చేరుకున్నాయి. ఇది వారి మొత్తం విదేశీ నిల్వలలో 6.8 శాతం వాటాను సూచిస్తుంది.
జూన్‌లో బంగారం దిగుమతులను చూసుకున్నట్లయితే.. 50 టన్నులకే పరిమితమయ్యాయి. ఇది మునుపటి నెలతో పోలిస్తే 45 శాతం తగ్గుదలగా ఉంది. ఇక 2025 మొదటి అర్ధభాగంలో మొత్తం 323 టన్నుల బంగారం మాత్రమే దిగుమతి అయినట్లుగా తెలుస్తోంది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే 62 శాతం తగ్గుబాటుగా చెప్పుకోవచ్చు. ఇక ముందున్న సీజన్‌ల్ సీజన్ కారణంగా ఆభరణాల డిమాండ్ కొంత మెరుగు పడవచ్చు. అయితే బంగారం ధరలు ఇప్పటికే చాలా ఎక్కువగా ఉన్నందువల్ల వాల్యూమ్ బలహీనంగా ఉండే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications