2025లో బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్ 16న భారతదేశంలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 1,28,395 చేరాయి. ఇది జనవరి నుండి దాదాపు 67 శాతం పెరుగుదలగా చెప్పుకోవచ్చు. ఇది స్టాక్ మార్కెట్లను కూడా ఇది అధిగమించింది. డిసెంబర్ 2024 నుండి అక్టోబర్ 2025 వరకు MCX గోల్డ్ ఫ్యూచర్స్ 64 శాతం పెరిగినప్పుడు, BSE సెన్సెక్స్ కేవలం 5 శాతం మాత్రమే పెరిగింది. ఈ భారీ పెరుగుదల పెట్టుబడిదారులను రెండు శిబిరాలుగా విభజించింది. ఒకవైపు బంగారం రూ. 3 లక్షల వరకు చేరుతుందని విశ్వసించే వారు కాగా.. మరోవైపు, త్వరలో తగ్గుదల వస్తుందని హెచ్చరిస్తున్న వారు ఉన్నారు.
బంగారం ధరల పెరుగుదలపై SEBIలో నమోదైన పరిశోధన విశ్లేషకుడు రాహుల్ జైన్ మాట్లాడుతూ.. గత 100 సంవత్సరాల్లో ఇలాంటి గోల్డ్ ర్యాలీ ఎప్పుడూ చూడలేదు. కేవలం 18 నెలల్లో ధరలు రెట్టింపు కావడం అద్భుతం. ఎవరూ ఊహించలేదన్నారు. బంగారం పెరుగుదల వెనుక ప్రధాన కారణం ప్రైవేట్ పెట్టుబడిదారుల చురుకుదనమని చెప్పుకొచ్చారు. సెంట్రల్ బ్యాంకులు కొనుగోళ్లు తగ్గించినప్పటికీ, 2025లో గోల్డ్ ETFలలో పెట్టుబడులు 64 బిలియన్ డాలర్లు దాటాయి 2024 కంటే నాలుగు రెట్లు ఎక్కువ. వాటిలో 50 శాతం కంటే ఎక్కువ ఉత్తర అమెరికా పెట్టుబడిదారులవేనని చెప్పవచ్చు.

వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా వడ్డీ రేటు కోతలు, బలహీన డాలర్, తగ్గుతున్న బాండ్ దిగుబడి.. ఇవన్నీ పెట్టుబడిదారులను బంగారం వంటి సురక్షిత ఆస్తులవైపు మళ్లించాయి. ధరలు పెరుగుతుండటంతో పెట్టుబడులకు కూడా ఇది సేఫ్ హెవెన్ లాగా మారిందని ఆయన తెలిపారు. ఇదే సమయంలో పోలాండ్, కజకిస్తాన్, చైనా, టర్కీ వంటి దేశాలు తమ నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. అవి కలిపి ఈ ఏడాది 70 టన్నులకు పైగా బంగారం కొనుగోలు చేశాయి. భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగితే 2026-27 నాటికి సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు మళ్లీ పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.
రాహుల్ జైన్ విశ్లేషణ ప్రకారం.. దీర్ఘకాలిక దృష్టిలో రూ. 3 లక్షల Gold ధర అసాధ్యం కాదని చెబుతున్నారు. 1980ల్లో ప్రైవేట్ పెట్టుబడిదారులు తమ ఆస్తులలో 8 శాతం బంగారంలో పెట్టేవారు, కానీ ఇప్పుడు అది 2-3 శాతానికి తగ్గిపోయింది. ఈ వాటా మళ్లీ పెరుగుతోందని ఆయన గుర్తుచేశారు. అదేవిధంగా సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వలలో కేవలం 20 నుంచి 22 శాతం మాత్రమే బంగారంలో ఉంచుతున్నాయి. ఇది గతంలో 50 నుంచి 60 శాతంగా ఉండేది.
ప్రైవేట్ పెట్టుబడిదారులు, సెంట్రల్ బ్యాంకులు ఇద్దరూ తమ Gold నిల్వలను చారిత్రక స్థాయికి తీసుకువస్తే, డిమాండ్ ధరలను బలంగా లాగుతుంది. ఇది ఇలాగే కొనసాగితే 5 నుంచి 10 సంవత్సరాల్లో రూ. 3 లక్షలు పూర్తిగా సాధ్యమేనని జైన్ పేర్కొన్నారు. ప్రస్తుత స్థాయిలో బంగారం ఎక్కువగా కొనబడింది. టెక్నికల్‌గా, ఇది 200 రోజుల చలన సగటు కంటే ఎక్కువగా ట్రేడ్ అవుతోంది. చరిత్రలో ఇలాంటి స్థాయిల తర్వాత సాధారణంగా తాత్కాలిక తగ్గుదల వస్తుందని కూడా ఆయన హెచ్చరిస్తున్నారు.
పెట్టుబడిదారులు 200 రోజుల సగటు వద్ద ధరలు స్థిరపడే వరకు వేచి ఉండాలని సూచిస్తున్నారు. ధర పెరిగిందని కొనకుండా SIPలు లేదా విడతలుగా బంగారం కొనడం మంచిదని చెబుతున్నారు. బంగారం ETFలు ఉత్తమ ఎంపిక అని చెబుతున్నారు. ఎందుకంటే ద్రవ్యత (liquidity), పారదర్శకత (transparency) కలిగి ఉంటాయని చెబుతున్నారు. NAV (నికర ఆస్తి విలువ) కంటే ఎక్కువ ధరతో ట్రేడ్ అవుతున్న ETFలను కొనకండి. అలా కొంటే మీరు ఎక్కువ ధర చెల్లించినట్లేనని సలహా ఇస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్‌ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి

ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..

భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..

Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు



Click it and Unblock the Notifications