తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ముట్టుకుంటేనే షాక్ కొడుతున్నాయి. నిన్న మొన్నటిదాకా తగ్గుముఖం పట్టిన ధరలు నేడు మళ్లీ పైకి ఎగబాకాయి. ఏకంగా లక్ష మార్కును తాకాయి, ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ నగరాల్లో Gold ధరలు లక్ష రూపాయలను దాటి పోయాయి. రెండు నగరాల్లో బంగారం ధరలు చూసుకున్నట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,00,480 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.92,100 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.74,870 గా నమోదైంది.
ఇక 100 గ్రాముల బంగారం ధరలు చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల బంగారం రూ. 6,600 పెరిగి రూ. 10,04,800 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.6,000 పెరిగి రూ. 9,21,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 4,900 పెరిగి రూ.7,53,600 వద్ద ట్రేడ్ అవుతోంది. ముందు ముందు కూడా ఇదే ఊపు కొనసాగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. పండగ సీజన్ మొదలు కానున్న నేపథ్యంలో పసిడి ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో బంగారం ప్రియులు ఈ పెరుగుదలను చూసి కొనేందుకు ఆసక్తి చూపడం లేదు.

మరో రెండు రోజుల్లో అంటే ఆగస్టు 1 నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇతర దేశాలపై విధించిన టారిఫ్ సుంకాలు అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలోనే పెట్టుబడిదారులు బంగారాన్ని మళ్లీ సురక్షితమైన డిమాండ్ గా పరిగణిస్తున్నారు. దీంతో Gold ధరలకు మళ్లీ రెక్కలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. లక్షను తాకిన బంగారం ధర లక్షా యాభై వేలను చేరడం ఎంతో దూరంలో లేదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఆగస్టు మొదటి వారంలోనే పసిడి ధర రూ. 1,50,000 తాకే అవకాశం ఉందని పసిడి ప్రియులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే బంగారం ధరలు వచ్చే సంవత్సరం చివరినాటికి ఔన్సుకు 4 వేల డాలర్లకు చేరుకుంటాయని ఫిడెలిటీ ఇంటర్నేషనల్ అంచనా వేసింది. మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు రూ.3.47 లక్షలు. దీనికి అనేక కారణాలను ఫిడెలిటీ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పలు ఆర్థిక, రాజకీయ అంశాలు భవిష్యత్తులో Gold పెరుగుదలకు కారణమవుతాయని తేల్చి చెప్పింది.ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతలు, బలహీనమైన డాలర్, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకుల బంగారం నిల్వల పెరుగుదల వంటి అంశాలు బంగారం ధరలను భవిష్యత్తులో విపరీతంగా ప్రభావితం చేస్తాయని Fidelity అంచనా వేసింది.
ఫిడెలిటీ మల్టీ-ఆస్తి నిధి నిర్వాహకుడు ఇయాన్ సామ్సన్ తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని నిధులు ఇప్పటికే బంగారంపై పెట్టుబడి కేటాయింపులను 5 శాతం నుంచి రెట్టింపు చేశాయి. ఇది Gold పట్ల ఉన్న విశ్వాసాన్ని చూపుతుంది. ఆగస్టు నెల మార్కెట్లకు సాధారణంగా అస్థిరంగా ఉండే సమయం కావడం వల్ల.. పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని పెంచే ప్రయత్నంలో ఉన్నారని అభిప్రాయపడ్డారు
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications