For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold & Silver Rates: ఖరీదైన బంగారం.. చౌకగా మారిన వెండి.. నేటి రేట్లు ఇలా..

|

Gold & Silver Rates: ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బంగారం వెండి రేట్లు రోజురోజుకూ మారుతున్నాయి. ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో బంగారం ధరలు ఊపందుకున్నాయి. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం మునుపటి రోజుతో పోల్చితే బంగారం రేట్లు పెరగగా.. వెండి రేటు మాత్రం కొంత తగ్గింది.

డిసెంబర్ 29న ధరలు..

డిసెంబర్ 29న ధరలు..

తాజా బులియన్ మార్కెట్ రేట్ల ప్రకారం 10 గ్రాముల బంగారం ధర రూ.54,000 వేల మార్కును దాటింది. అలాగే కిలో వెండి ధరను గమనించినట్లయితే రూ.67,000కి మించి కొనసాగుతోంది. 999 స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,649, వెండి ధర రూ.67,660గా ఉంది. అలాగే 995 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.54,430 వద్ద ఉంది. ఇక 916 కేడీయం బంగారం మాత్రం రూ.50,059 వద్ద కొనసాగుతోంది. 750 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.40,987కి పెరిగింది.

అసలు పెరిగిన ధర..

అసలు పెరిగిన ధర..

బంగారం, వెండి ధరల్లో అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా మార్పు కనిపిస్తోంది. డిసెంబర్ 29 తాజా రేట్ల ప్రకారం 999 స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.78 తగ్గగా.. 916 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.59, 585 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.46 పెరిగింది. అలాగే కేజీ వెండి ధర ఈరోజు రూ.188 మేర తగ్గింది.

వివిధ క్యారెట్ల మధ్య వ్యత్యాసం..?

వివిధ క్యారెట్ల మధ్య వ్యత్యాసం..?

24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారం అంటారు. ఇందులో మరే ఇతర లోహం కలపరు. దీనిని 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం అంటారు. 22 క్యారెట్ల బంగారంలో 91.67 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. మరో 8.33 శాతం ఇతర లోహాల కలుపుతారు. 21 క్యారెట్ల బంగారంలో 87.5 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. 18 క్యారెట్లలో 75 శాతం స్వచ్ఛమైన బంగారం, 14 క్యారెట్ల బంగారంలో 58.5 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది.

మిస్డ్ కాల్ ద్వారా రేట్లు..

మిస్డ్ కాల్ ద్వారా రేట్లు..

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు మినహా.. శని, ఆదివారాల్లో ibja ద్వారా రేట్లు జారీ చేయబడవు. 22 క్యారెట్లు, 18 క్యారెట్ల బంగారు ఆభరణాల రిటైల్ ధరను తెలుసుకోవడానికి 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. కాల్ చేసిన కొద్దిసేపట్లో SMS ద్వారా రేట్లు నేరుగా పొందవచ్చు.

Read more about: gold silver investment business news
English summary

Gold & Silver Rates: ఖరీదైన బంగారం.. చౌకగా మారిన వెండి.. నేటి రేట్లు ఇలా.. | Gold rising silver falling Know altest rates of different qualities

Gold rising silver falling Know altest rates of different qualities
Story first published: Thursday, December 29, 2022, 15:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X