ఈ ఏడాది బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో దేశాల దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ లో కూడా మార్పులు వచ్చాయి. కొన్ని దేశాలు సైలెంట్ గా గోల్డ్ రిజర్వ్ ను పెంచుకుంటే మరికొన్ని భూమిలో ఉన్న బంగారాన్ని బయటకు తీసే పనిలో పడ్డాయి. ప్రస్తుతం ఏయే దేశాల్లో ఎంత బంగారం ఉందంటే..

బంగారు నిల్వలు ఒక దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చివేయగలవు. అందుకే బంగారాన్ని అనేది స్థిరమైన సంపదగా భావిస్తుంటాయి దేశాలు. బంగారు నిల్వల విషయంలో 2025 నాటికి అమెరికా, యూరప్ దేశాలు ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి? ఆసియా దేశాలు ఎంతవరకు చేరుకున్నాయో చూద్దాం.
2025లో రికార్డు స్థాయిలో..
ఈ ఏడాది బంగారం అన్ని దేశాల కేంద్ర బ్యాంకుల దృష్టిని పూర్తిగా ఆకర్షించింది. 2025 ప్రారంభంలోనే బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. అప్పట్నుంచి ఇప్పటివరకూ బంగారం కొనుగోళ్ల జోరు ఏమాత్రం తగ్గలేదు. తాజాగా బులియన్ వాల్ట్ (BullionVault) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రపంచంలోని బంగారం నిల్వలు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయట.
యూఎస్ vs యూరప్
ప్రపంచ బంగారు నిల్వల్లో యూఎస్ అగ్రస్థానంలో ఉంది. అమెరికా దగ్గర 8,133.5 టన్నుల బంగారు నిల్వలు ఉన్నాయి. ఇవి దశాబ్దాలుగా ఇలాగే స్థిరంగా ఉన్నాయి. ఈ నిల్వల్లో ఎక్కువ భాగం ఫోర్ట్ నాక్స్, న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్‌లో ఉన్నాయి. వీటి విలువ ట్రిలియన్ డాలర్లకు పైనే ఉంటుందని అంచనా. ఇక రెండో స్థానంలో యూరప్ దేశాలు ఉన్నాయి. యూరప్ దేశాలన్నీ కలిపి చూస్తే.. అవి అమెరికాకు గట్టి పోటీ ఇస్తున్నాయి. జర్మనీ (3,351.6 టన్నులు), ఇటలీ (2,451.9 టన్నులు), ఫ్రాన్స్ (2,437 టన్నులు) దేశాల మొత్తం నిల్వలు అమెరికా నిల్వలకు దాదాపు సమానంగా ఉన్నాయి. మొత్తానికి ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారు నిల్వల్లో 60% కంటే ఎక్కువ వాటా అమెరికా, యూరప్ దేశాల్లో ఉంది.
ఆసియా పరిస్థితి ఏంటి?
బంగారం విషయంలో అమెరికా, యూరప్ ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, ఆసియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు వ్యూహాత్మకంగా బంగారాన్ని కొనుగోలు చేస్తూ వస్తున్నాయి. చైనా నిలకడగా బంగారాన్ని పోగేస్తోంది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో 331 టన్నులు కొనుగోలు చేసి, తమ నిల్వలను 2,279.6 టన్నులకు పెంచుకుంది. ఇక భారత్ విషయానికొస్తే.. ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్, 876.2 టన్నుల బంగారాన్ని నిల్వ చేసింది.
ఇకపోతే జపాన్ (846 టన్నులు) భారత్ కంటే స్వల్పంగా వెనుకబడి ఉంది. తుర్కియే (595.4 టన్నులు) , పోలాండ్ (448.2 టన్నులు) కూడా 2019 తర్వాత తమ నిల్వలను గణనీయంగా పెంచుకున్నాయి.
చిన్న దేశాలు కూడా..
కొన్ని చిన్న దేశాలు కూడా భారీగా బంగారాన్ని పోగు చేసుకున్నాయి. స్విట్జర్లాండ్ (1,039.9 టన్నులు), ఉజ్బెకిస్తాన్ (382.6 టన్నులు), సౌదీ అరేబియా (323.1 టన్నులు) వంటి చిన్న దేశాలు కూడా పెద్ద మొత్తంలో బంగారాన్ని అట్టిపెట్టుకున్నాయి. థాయిలాండ్, కజకిస్తాన్, సింగపూర్ వంటి అభివృద్ధి చెందుతున్న అనేక దేశాలు కూడా రీసెంట్ టైమ్స్ లో బంగారాన్ని కొనుగోలు చేస్తూ వచ్చాయి.
మొత్తంగా దేశాల వారీగా గోల్డ్ రిజర్వ్స్ (gold reserves by country) చూస్తే.. ప్రస్తుతానికి అత్యధిక బంగారు నిల్వలు ఉన్న దేశం.. యునైటెడ్ స్టేట్స్ (8,133.5 టన్నులు). వేగంగా నిల్వలు పెంచుకున్న దేశాలు చైనా, భారత్, తుర్కియే, పోలాండ్. ఈ ట్రెండ్ 2026లో కూడా ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు



Click it and Unblock the Notifications