Gold Rate: మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్ ధర.. నేడు రూ.1100 అప్, న్యూఇయర్ నుంచి ఆగని దూకుడు..
Gold Price Today: దేశీయంగా పసిడి ధరలు నిరంతరాయంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో జనవరి 1 నుంచి పెరుగుతూ వచ్చిన ధరలు గడచిన మూడు రోజులుగా స్థిరంగా కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ రేట్లు తిరిగి పెరగటం ప్రారంభించాయి. ట్రంప్ బాధ్యతలు చేపట్టే సమయం దగ్గరపడుతున్న వేళ రేట్ల పెరుగుదల కొనసాగుతోంది. వాస్తవానికి డాలర్ ధర పెరుగుతున్నప్పుడు తగ్గాల్సిన పసిడి ధరలు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా 1000 రూపాయలు పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7225, ముంబైలో రూ.7225, దిల్లీలో రూ.7240, కలకత్తాలో రూ.7225, బెంగళూరులో రూ.7225, కేరళలో రూ.7225, వడోదరలో రూ.7230, అహ్మదాబాదులో రూ.7230, జైపూరులో రూ.7229, లక్నోలో రూ.7229, మధురైలో రూ.7214, కోయంబత్తూరులో రూ.7214, మంగళూరులో రూ.7225, నాశిక్ లో రూ.7228, మైసూరులో రూ.7225, అయోధ్యలో రూ.7240, బళ్లారిలో రూ.7225, గురుగ్రాములో రూ.7240, నోయిడాలో రూ.7240 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1100 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7882, ముంబైలో రూ.7882, దిల్లీలో రూ.7897, కలకత్తాలో రూ.7882, బెంగళూరులో రూ.7882, కేరళలో రూ.7882, వడోదరలో రూ.7887, అహ్మదాబాదులో రూ.7887, జైపూరులో రూ.7885, లక్నోలో రూ.7885, మధురైలో రూ.7870, కోయంబత్తూరులో రూ.7870, మంగళూరులో రూ.7882, నాశిక్ లో రూ.7885, మైసూరులో రూ.7882, అయోధ్యలో రూ.7897, బళ్లారిలో రూ.7882, గురుగ్రాములో రూ.7897, నోయిడాలో రూ.7897గా ఉన్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలోని హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7225గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7882 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,00,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications