Gold Price Today: దేశీయంగా పసిడి ప్రియులకు సోమవారం చిన్న షాక్ తగిలింది. గడచిన వారంలో నిరంతరాయంగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు నేడు మాత్రం మళ్లీ పుంజుకున్నాయి. దీనికి ముందు శనివారం సైతం గోల్డ్ ధరలు స్వల్ప పెరుగుదలను చూశాయి. అయినప్పటికీ అరబిక్ దేశాలు, సింగపూర్ కంటే పసిడి ధరలు ఇండియాలో తక్కువగా ఉన్నట్లు తెలిసింది. కానీ ఇప్పుడు గోల్డ్ షాపింగ్ చేయటానికి ముందు తాజా ధరలను తప్పక పరిశీలించాల్సిందే.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.6000 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6995, ముంబైలో రూ.6995, దిల్లీలో రూ.7010, కలకత్తాలో రూ.6995, బెంగళూరులో రూ.6995, కేరళలో రూ.6995, పూణేలో రూ.6995, వడోదరలో రూ.7000, జైపూరులో రూ.7010, లక్నోలో రూ.7010, కోయంబత్తూరులో రూ.6995, మంగళూరులో రూ.6995, నాశిక్ లో రూ.6998, అయోధ్యలో రూ.7010, బళ్లారిలో రూ.6995, నోయిడాలో రూ.7010, గురుగ్రాములో రూ.7010 వద్ద నేడు విక్రయాలు జరుగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.6600 భారీ పెరుగుదలను చూసింది. దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7631, ముంబైలో రూ.7631, దిల్లీలో రూ.7646, కలకత్తాలో రూ.7631, బెంగళూరులో రూ.7631, కేరళలో రూ.7631, పూణేలో రూ.7631, వడోదరలో రూ.7636, అహ్మదాబాదులో రూ.7636, జైపూరులో రూ.7646, లక్నోలో రూ.7646, కోయంబత్తూరులో రూ.7631, మంగళూరులో రూ.7631, నాశిక్ లో రూ.7634, అయోధ్యలో రూ.7646, బళ్లారిలో రూ.7631, నోయిడాలో రూ.7646, గురుగ్రాములో రూ.7646గా ఉన్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.6995గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7631 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6995గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7631 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.99,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!

Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications