Gold Rate: గోల్డ్ రేటు చూస్తే గుండెపోటే.. విలపిస్తున్న షాపు యజమానులు, నేడు రూ.7,000 అప్..

Gold Price Today: పసిడి మార్కెట్లలో కళకళలు పెట్టుబడిదారులను సంతోష పెడుతున్నప్పటికీ రిటైల్ వ్యాపారులు, ఆభరణాలు కొనాలనుకుంటున్న భారతీయ కుటుంబాలకు మాత్రం పెద్ద షాక్ ఇస్తోంది. నిరంతరం పెరుగుతున్న ధరలు ఇంకెంత కాలం కొనసాగుతాయనే గందరగోళం సాధారణ ప్రజల్లో ఉంది. ఈ క్రమంలో షాపింగ్ చేయటానికి వెళ్లే ముందు నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలించటం చాలా ముఖ్యం.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.6,500 భారీ పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8035, ముంబైలో రూ.8035, దిల్లీలో రూ.8045, కలకత్తాలో రూ.8035, బెంగళూరులో రూ.8035, కేరళలో రూ.8035, వడోదరలో రూ.8040, అహ్మదాబాదులో రూ.8040, జైపూరులో రూ.8045, లక్నోలో రూ.8045, కోయంబత్తూరులో రూ.8035, మంగళూరులో రూ.8035, నాశిక్ లో రూ.8038, మైసూరులో రూ.8035, అయోధ్యలో రూ.8045, బళ్లారిలో రూ.8035, గురుగ్రాములో రూ.8045, నోయిడాలో రూ.8045 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

Gold rates unstoppable rally shocking Indian buyers amid Trump Tariff fears looming across globe

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.7,000 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ రేట్లను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8765, ముంబైలో రూ.8765, దిల్లీలో రూ.8780, కలకత్తాలో రూ.8765, బెంగళూరులో రూ.8765, కేరళలో రూ.8765, వడోదరలో రూ.8770, అహ్మదాబాదులో రూ.8770, జైపూరులో రూ.8780, లక్నోలో రూ.8780, కోయంబత్తూరులో రూ.8765, మంగళూరులో రూ.8765, నాశిక్ లో రూ.8768, మైసూరులో రూ.8765, అయోధ్యలో రూ.8780, బళ్లారిలో రూ.8765, గురుగ్రాములో రూ.8780, నోయిడాలో రూ.8780గా ఉన్నాయి. అయితే పైన పేర్కొన్న ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి వంటి వాటిని కలపక ముందువిగా గమనించాలి.

నిరంతర పెరుగుదల ఎందుకు..?
వాస్తవానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై వాణిజ్య పన్నులను వరుసగా ప్రకటిస్తున్న వేళ సెంట్రల్ బ్యాంకుల నుంచి ఇప్పటికే సేఫ్ హెవెన్ గోల్డ్ కోసం నిరంతరం డిమాండ్ పెరుగుతూనే ఉంది. దీనికి తోడు చరిత్రలో తొలిసారిగా అమెరికా దిగ్గజ బ్యాంకులైన హెచ్ఎస్బీసీ, జేపీ మోర్గన్ ఇటీవల బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ నుంచి తమ పసిడి నిల్వలను భౌతికంగా వెనక్కి తీసుకున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం పసిడి ధర ఔన్సుకు 3000 డాలర్లకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా గోల్డ్ భారీగా ధర పెరుగుతూ భవిష్యత్తు ధరలపై క్లారిటీ వస్తోంది.

మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది.

తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.8035గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8765 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,08,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+