పెరిగిపోతున్న డాలర్ విలువ.. పడిపోతున్న గోల్డ్ రేటు, మరి వచ్చే నెల పసిడి రేట్లు తగ్గుతాయా?..
Gold Prices: ట్రంప్ వైట్ హౌస్ పగ్గాలు చేపట్టడానికి టైం దగ్గరపడుతున్న వేళ అధ్యక్షుడిగా పట్టుబిగించటం ప్రారంభించారు. దీంతో అమెరికా పెత్తనానికి కారణమైన డాలర్ జోలికి వస్తే బ్రిక్ దేశాల తోలు తీస్తానని ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య చెల్లింపులకు డాలర్ బదులుగా స్థానిక కరెన్సీలు వాడటాన్ని సహించేది లేదని తేల్చి చెప్పటంతో డాలర్ విలువ మరింతగా బలపడుతోంది. నవంబర్ నెలలో డాలర్ ఇండెక్స్ 2 శాతం పెరుగుదలను చూసింది.
ఇటీవలి కాలంలో పసిడి ధరలు ఆల్ టైం గరిష్ఠ స్థాయికి చేరుకున్నప్పటికీ ప్రస్తుతం కొన్ని రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే రానున్న నెలల్లో బంగారం ధరలు ప్రస్తుత స్థాయిలో పెరగకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గడచిన ఏడాది కాలంలో పసిడి ధరలు అంతర్జాతీయ మార్కెట్లలో 29 శాతానికి పైగా పెరిగాయి. అలాగే ఆరు నెలల కాలాన్ని పరిశీలిస్తే ఈ పెరుగుదల 12.69 శాతంగా ఉంది. అయితే గడచిన నెల రోజులను చూస్తే ఈ ట్రెండ్ రివర్స్ అయ్యి ధరలు గ్లోబల్ మార్కెట్లలో 3.69 శాతం పతనాన్ని చూశాయి. సెప్టెంబర్ 2023 తర్వాత బంగారం ధర ఈ మేరకు తగ్గడం ఇదే తొలిసారని నిపుణులు చెబుతున్నారు.

యూఎస్ కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలుపుతో డాలర్ విలువ రేసుగుర్రం మాదిరిగా దూసుకుపోతోంది. దీంతో పసిడిపై పెట్టుబడి పెట్టే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గిపోతోందని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ ఉద్రిక్తత, మధ్యప్రాచ్య దేశాల్లో ఉద్రిక్తతలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో పాటు మరికొన్ని కారణాలతో అంతర్జాతీయంగా బంగారం ధర గత కొంతకాలంగా పెరుగుదలను చూసిన సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ గెలుపు ప్రకటన తర్వాత అంతర్జాతీయంగా అమెరికా డాలర్ విలువ పెరుగుతోంది. దీంతో బంగారం ధర తగ్గుతోందని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ జిగర్ త్రివేది పేర్కొన్నారు. గ్లోబల్ అనిశ్చితులు, వాణిజ్య యుద్ధాల సమయంలో పెట్టుబడిదారులతో పాటు, వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు సేఫ్ హెవెన్ గోల్డ్ కొనుగోళ్లు చేపడుతుంటాయి.
అయితే ప్రస్తుతం అమెరికాను పారిశ్రామికంగా తిరిగి బలపరిచేందుకు ట్రంప్ చేపట్టనున్న వేళ తిరిగి ప్రపంచవ్యాప్తంగా యూఎస్ కంపెనీల లాబియింగ్ తిరిగి పుంజుకుంటుందని చాలా మంది భావిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులను ఆపేందుకు సైతం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు కేడియా కమోడిటీస్ డైరెక్టర్ అజయ్ కేడియా అన్నారు. ఈ క్రమంలోనే అందరి చూపు రాబోయే ఫెడ్ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపు ఎంతవరకు ఉంటుందనే అంశంపై దృష్టిని కొనసాగిస్తున్నారు.


Click it and Unblock the Notifications