Gold rates: బంగారం కొనాలనుకుంటున్నారా? ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఇలా..
నేడు మార్కెట్ ప్రారంభం కావడమే బంగారం, వెండి ధరలు జోరుగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలహీనపడటం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు (Geopolitical tensions) ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను బంగారం వైపు మళ్ళిస్తున్నాయి. నేడు జనవరి 9, శుక్రవారం ఉదయం సమయానికి గోల్డ్ రేట్స్ (Gold rates) ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

నేటి మార్కెట్ అప్‌డేట్ (MCX Rates)
మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,38,012 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా వెండి కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 2,45,072 వద్ద కొనసాగుతోంది.
ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు
- డాలర్ బలహీనపడటం: డాలర్ ఇండెక్స్ కొంత తగ్గడంతో విదేశీ కొనుగోలుదారులకు బంగారం చౌకగా మారింది. దీనివల్ల డిమాండ్ పెరిగింది.
- గ్రీన్‌లాండ్ వివాదం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 'గ్రీన్‌లాండ్' ద్వీపాన్ని దక్కించుకోవాలనే ఆసక్తి చూపడంపై ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి యూరోపియన్ దేశాలు తీవ్రంగా స్పందించాయి. ఈ రాజకీయ అనిశ్చితి గోల్డ్ ధరలకు సపోర్ట్‌గా నిలిచింది.
- రష్యాపై ఆంక్షలు: రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపై 500% వరకు టారిఫ్ విధిస్తామన్న అమెరికా హెచ్చరికలు గ్లోబల్ ఎకానమీలో ఆందోళనను పెంచాయి. ఇలాంటి సమయంలో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారంపై మొగ్గు చూపుతారు.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Gold rates city wise)
ఈరోజు 24 క్యారెట్ల (10 గ్రాములు), 22 క్యారెట్ల బంగారం ధరలు ఇలా ఉన్నాయి..
- హైదరాబాద్ (Hyderabad): 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,38,711 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,27,150 గా ఉంది.
- చెన్నై (Chennai): 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,39,640 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,28,000 గా ఉంది.
- బెంగళూరు (Bangalore): 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,38,711 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,27,150 గా ఉంది.
- ఢిల్లీ (Delhi): 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,38,860 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,27,300 గా ఉంది.
- ముంబై (Mumbai): 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,38,711 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,27,150 గా ఉంది.
ఇది బంగారం కొనడానికి సరైన సమయమేనా?
ధరలు రికార్డు స్థాయికి చేరువలో ఉన్న వేళ సామాన్యుల్లో ఒకటే ప్రశ్న.. ఇప్పుడే కొనాలా లేక ధరలు తగ్గే వరకు ఆగాలా?
ఆర్థిక నిపుణుడు జిగర్ త్రివేది (Reliance Securities) అభిప్రాయం ప్రకారం.. ప్రస్తుతానికి మార్కెట్ కొంత ఒడిదుడుకులకు గురయ్యే అవకాశం ఉంది. రాబోయే అమెరికా ఉద్యోగ గణాంకాల (Non-farm payrolls) కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. మరో నిపుణుడు మనోజ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. "దీర్ఘకాలికంగా చూస్తే బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. కానీ, కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు మార్కెట్ కొంత స్థిరపడే వరకు వేచి చూడటం ఉత్తమం" అని సూచించారు.
ఏదేమైనా.. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కొద్దికొద్దిగా ఇన్వెస్ట్ చేయడం మంచిదే. కానీ, కేవలం లాభాల కోసం ట్రేడింగ్ చేసే వారు మాత్రం మార్కెట్ హెచ్చుతగ్గులను గమనిస్తూ జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి.


Click it and Unblock the Notifications