పసిడి ప్రియులకు శుభవార్త.. ఈ మధ్య వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న దేశ రాజధాని ఢిల్లీలో లక్ష మార్కును తాకిన బంగారం ధర నేడు తగ్గుముఖం పట్టి పసిడి ప్రియులకు ఊరట కలిగించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్, మెక్సికో నుండి దిగుమతులపై 30 శాతం సుంకం విధిస్తామని బెదిరించిన తర్వాత పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పెట్టుబడిదారులు ఈ ఉద్రిక్తతలతో మళ్లీ బంగారం వైపు పరుగులు పెట్టారు.
అమెరికా ప్రపంచ వాణిజ్య సుంకాల విధానం వల్ల ఏర్పడిన అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారుల నుంచి సురక్షిత పెట్టుబడికి డిమాండ్ మళ్లీ పెరుగుతోంది. నేడు తగ్గినా సమీప భవిష్యత్తులో బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ మార్కెట్లలొ అనిశ్చిత పరిస్థితులు, US డాలర్ ఇండెక్స్‌లో కొనసాగుతున్న బలహీనత, వాణిజ్య సంబంధిత సంఘటనల కారణంగా, రాబోయే వారంలో బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 30% సుంకాలు ఆగస్టు 1 నుండి అమల్లోకి రానున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన ప్రకారం.. యూరోపియన్ యూనియన్, మెక్సికోతో జరిగిన వాణిజ్య చర్చలు విజయవంతం కాలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దీనిపై EU, మెక్సికో స్పందించాయి. తమపై అమెరికా విధించిన సుంకాలు అన్యాయమని ఆరోపించాయి. అవి అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు వ్యతిరేకమని ఆరోపించాయి. అయినా కూడా EU ప్రభుత్వం ఆగస్టు ప్రారంభం వరకు ప్రతిస్పందనను వాయిదా వేస్తూ చర్చల ద్వారానే ఈ సమస్యపై పరిష్కారం కోరుకుంటున్నామని తెలిపింది.
జూలై 15న బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 11 రూపాయిలు తగ్గింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.9,977 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర 10 రూపాయిలు తగ్గి 9,145 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారట్ల గ్రాము బంగారం ధర 8 రూపాయిలు తగ్గి రూ.7,483 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1100 తగ్గి రూ. 9,97,700 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర రూ.1,000 తగ్గి రూ. 9,14,500 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర రూ. 800 తగ్గి రూ. 7, 48,300 వద్ద ట్రేడ్ అవుతోంది.
హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,770 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,450 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,830 గా నమోదైంది.
విజయవాడ విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,770 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,450 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,830 గా నమోదైంది.
మీ ఏరియాలో బంగారం ధరలు చెక్ చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోండి
చెన్నైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,770 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,450 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.75,350 గా నమోదైంది.
ముంబైలో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,770 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,450 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,830 గా నమోదైంది.
ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,920 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.91,600 రూపాయలు పలుకుతోంది.ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,950 నమోదైంది.
ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,820 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,500 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,870 గా నమోదైంది.
బెంగుళూరులో బంగారం ధరలను పరిశీలించినట్లయితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,770 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,450 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,830 గా నమోదైంది.
కలకత్తా విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,770 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,450 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,830 గా నమోదైంది.
విశాఖపట్నం విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,770 దగ్గర ట్రేడ్ అవుతోంది.అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. రూ.91,450 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,830 గా నమోదైంది.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత స్వీకరించరు. కాబట్టి మీరు ఏదైనా కొనుగోలు జరిపే ముందు నిపుణులు సంప్రదించి నిర్ణయం తీసుకోండి.


Click it and Unblock the Notifications