రూ. 8,700 పెరిగిన బంగారం ధర.. ఈ ధరకు దిగి వచ్చేదాకా ఆగమంటున్న ఆర్థిక నిపుణులు
దేశంలో మరోసారి బంగారం ధరలు భగ్గుమన్నాయి. గత రెండు రోజులగా ఊరటనిచ్చిన బంగారం ధరలు మళ్ళీ ఒక్కసారిగా పెరిగాయి. ఈరోజు, సెప్టెంబర్ 16, 2025న, భారతదేశంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. పెళ్లిళ్లు, పండుగల సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో డిమాండ్ భారీగా పెరిగింది. అంతేకాదు, డాలర్ బలహీనపడటం, US ఫెడరల్ రిజర్వ్ నుండి వడ్డీ రేటు తగ్గింపు సంకేతాలు రావడం కూడా Gold ధరలపై ప్రభావం చూపాయి.
ప్రధానంగా పెళ్లిళ్లు, పండుగల సమయంలో బంగారం, వెండి కొనుగోలు అధికంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే, ప్రపంచ మార్కెట్లలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గించే సంకేతాలు, డాలర్ బలహీనపడటం కూడా పెట్టుబడిదారుల్లో విపరీతమైన ఆసక్తిని పెంచాయి. అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సుకు 3,670 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది, ఇది రికార్డు స్థాయిగా చెప్పుకోవచ్చు. MCX బంగారం ధర ఒక నెలలోనే 12 శాతం పెరిగింది.

వేగంగా పెరుగుతున్న బంగారం ప్రస్తుతం పీక్ జోన్‌లో ఉంది. RSI (Relative Strength Index) 80 స్థాయిలకి పైగా ఉంది. తక్షణ మద్దతు రూ. 1,08,900 వద్ద ఉండగా.. నిరోధం రూ. 1,12,000 వద్ద ఉంది.అంటే బంగారం రూ. లక్షా 8 వేల దిగువకు వచ్చినప్పుడు మాత్రమే కొనుగోలు చేయాలని నిపుణులు చెబుతున్నారు. రూ. లక్షా 12 వేలు దాటితే ఆగిపోవాలని సూచిస్తున్నారు. ఈ వారం ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపు అవకాశంపై పెట్టుబడిదారులు ఆశపడుతున్నారు.
భవిష్యత్తులో ధరలు మరింత పెరగొచ్చని నిర్మల్ బ్యాంక్ సెక్యూరిటీస్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భారీ పెరుగుదల వల్ల పెళ్లిళ్లు, పండుగల కోసం బంగారం కొనుగోలు చేసే కుటుంబాలకు, అలాగే పెట్టుబడిదారులకు మంచి అవకాశాలు ఏర్పడుతున్నాయి. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకొని వారు ముందుగా కొనుగోలు చేస్తూ లాభాలను పొందుతున్నారు.
24 క్యారెట్ల బంగారం ధర:
ఈ రోజు ఒక గ్రాము బంగారం ధర రూ. 11,106 నుండి రూ. 11,193కి పెరిగింది, అంటే రూ.87 పెరుగుదల నమోదు చేసింది.
8 గ్రాములు: రూ. 88,848 → రూ. 89,544 (+రూ. 696)
10 గ్రాములు: రూ. 1,11,060 → రూ. 1,11,930 (+రూ. 870)
100 గ్రాములు: రూ. 11,10,600 → రూ. 11,19,300 (+రూ 8,700)
22 క్యారెట్ల బంగారం ధర:
ఒక గ్రాము రూ. 10,180 → రూ. 10,260 (+రూ.80)
8 గ్రాములు: రూ.81,440 → రూ.82,080 (+రూ.640)
10 గ్రాములు: రూ.1,01,800 → రూ.1,02,600 (+రూ.800)
100 గ్రాములు: రూ.10,18,000 → రూ.10,26,000 (+రూ.8,000)
18 క్యారెట్ల బంగారం ధర:
ఒక గ్రాము రూ.8,329 → రూ.8,395 (+రూ.66)
8 గ్రాములు: రూ.66,632 → రూ.67,160 (+రూ.528)
10 గ్రాములు: రూ.83,290 → రూ.83,950 (+రూ.660)
100 గ్రాములు: రూ.8,32,900 → రూ.8,39,500 (+రూ.6,600)
వెండి ధర:
ప్రతి గ్రాముకు రూ.133 → రూ.134 (+రూ.1),
1 కిలో వెండి రూ.1,33,000 → రూ.1,34,000 (+రూ.1,000).
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications