Gold Price Today: బడ్జెట్ ప్రకటనలకు ముందుగానే ఆందోళనలు మెుదలయ్యాయి. ఈసారి బడ్జెట్లో పసిడి దిగుమతులపై సుంకాలను కేంద్ర ప్రభుత్వం పెంచనుందనే ఆందోళనల మధ్య గోల్డ్ ధరలు ఇండియాలో భారీగా పెరిగాయి. దీంతో పసిడి కొనుగోలుదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ చేసే ముందు ప్రజలు తాజా ధరలను తప్పక పరిశీలించాల్సిందే.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.8500 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7595, ముంబైలో రూ.7595, దిల్లీలో రూ.7610, కలకత్తాలో రూ.7595, బెంగళూరులో రూ.7595, కేరళలో రూ.7595, వడోదరలో రూ.7600, జైపూరులో రూ.7610, కోయంబత్తూరులో రూ.7595, మంగళూరులో రూ.7595, నాశిక్‌లో రూ.7598, అయోధ్యలో రూ.7610, నోయిడాలో రూ.7610, గురుగ్రాములో రూ.7610, బళ్లారిలో రూ.7595గా విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.9,200 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన నేటి రిటైల్ విక్రయ ధరలను పరిగణిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8285, ముంబైలో రూ.8285, దిల్లీలో రూ.8300, కలకత్తాలో రూ.8285, బెంగళూరులో రూ.8285, కేరళలో రూ.8285, వడోదరలో రూ.8290, జైపూరులో రూ.8300, కోయంబత్తూరులో రూ.8285, మంగళూరులో రూ.8285, నాశిక్‌లో రూ.7598, అయోధ్యలో రూ.8300, నోయిడాలో రూ.8300, గురుగ్రాములో రూ.8300, బళ్లారిలో రూ.8285గా ఉన్నాయి.
బడ్జెట్ భయాలు..
వాస్తవానికి గత బడ్జెట్ సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారం దిగుమతులపై సుంకాన్ని భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వినియోగం భారీగా పెరగటంతో దిగుమతులు పెరిగాయనే వాదన వినిపిస్తోంది. అయితే దీనిని అదుపుచేసేందుకు ఈసారి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పసిడి దిగుమతులపై భారీగా పన్నులను పెంచవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇది దిగుమతులు పెరుగుదలతో ట్రేడ్ డెఫిసిట్ పెంచుతోందని నిపుణులు వాదిస్తున్నారు. ప్రస్తుతం డాలర్ ధర బలంగా ఉండటంతో పాటు రూపాయి మారకపు విలువ పడిపోవటం ఆర్థిక లోటును మరింతగా పెంచుతోందని నిపుణులు చెప్పటం భయాలకు కారణంగా తెలుస్తోంది.
హైదరాబాదులో పసిడి ధరలు..
ఇదే క్రమంలో తెలంగాణలోని.. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7595గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8285 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి తగ్గి నేడు రూ.1,04,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం, వెండి ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications