Gold Price Today: గత వారం చివరిలో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు చరిత్రాత్మక గరిష్టాలను తాకిన సంగతి తెలిసిందే. దీంతో ఈ వారం అంతర్జాతీయ మార్కెట్లలో ట్రేడింగ్‌లో మొదటి రోజున పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం గరిష్టంగా 2,507 డాలర్లను తాకిన బంగారం ఇప్పుడు కాస్త తగ్గటం స్వల్ప ఊరటను కలిగిస్తోంది.
వాస్తవానికి US ఆర్థిక వ్యవస్థలో మాంద్యం భయాలు పెరగడంతో, పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను రక్షించుకోవడానికి బంగారంలో గణనీయమైన మొత్తంలో పెట్టుబడి పెట్టారు. అయితే తాజా యూఎస్ డేటా ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చినట్లు వెల్లడించాయి. దీంతో యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రానున్న సెప్టెంబర్ సమావేశంలో వడ్డీ రేటును 0.25 శాతం తగ్గించడం ఖాయంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇదే జరిగితే అది భయాలను తొలగించటంతో పాటు పసిడి ధరలు సామాన్యులకు చేరువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీనికి తోడు ఇతర అంతర్జాతీయ పరిణామాలను పరిశీలిస్తే.. మిడిల్ ఈస్ట్, ఉక్రెయిన్ వంటి దేశాల్లో రాజకీయ వాతావరణం బంగారం ధరలకు మద్దతుగా ఉండగా, అమెరికా వడ్డీరేట్ల తగ్గింపు బంగారం ధరలు పెరిగే అవకాశాలను చల్లార్చాయి. ఈ క్రమంలో నేడు అంతర్జాతీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర ఔన్సుకు 2507 డాలర్ల నుంచి 2496 డాలర్లకు తగ్గింది. ఈ క్షీణత బంగారం ధరలను వాటి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిల నుంచి తగ్గేందుకు దోహదపడ్డాయి. భారతదేశంలో పరిస్థితులను గమనిస్తే.. నేడు MCX ఫ్యూచర్స్ ఆర్డర్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 0.23 శాతం పెరిగి రూ.71,539కి చేరుకుంది. అలాగే వెండి ధర 0.78 శాతం పెరిగి రూ.83,860కి చేరుకుంది. అయితే రిటైల్ మార్కెట్లలో మాత్రం ధరల్లో ఎలాంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి..
ఈరోజు రిటైల్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,700గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,770గా ఉంది. అదే విధంగా నేడు రిటైల్ మార్కెట్‌లో ఆభరణాల బంగారం ధర సావాన్‌కు రూ.53,360గా ఉంది. వెండి కిలో ధర రూ.91,000.
22 క్యారెట్ పసిడి ధర: భారతదేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధర గ్రాముకు.. చెన్నై - రూ.6,670, ముంబై - రూ.6,670, దిల్లీ - రూ.6,685, కోల్‌కతా - రూ.6,670, బెంగళూరు - రూ.6,670, హైదరాబాద్ - రూ.6,670, విశాఖలో- రూ.6,670, నెల్లూరు- రూ.6,670, కేరళ - రూ.6,670, పూణే - రూ.6,670, బరోడా - రూ.6,673, అహ్మదాబాద్ - రూ.6,673, జైపూర్ - రూ.6,685, లక్నో - రూ.6,685, కోయంబత్తూర్ - రూ.6,670, మదురై - రూ.6,670గా కొనసాగుతున్నాయి.
24 క్యారెట్ గోల్డ్ రేటు: దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధర గ్రాముకు.. చెన్నై - రూ.7,277, ముంబై - రూ.7,277, దిల్లీ - రూ.7,292, కోల్‌కతా - రూ.7,277, బెంగళూరు - రూ.7,277, హైదరాబాద్ - రూ.7,277, కేరళ - రూ.7,277 , పూణె - రూ.7,277, బరోడా - రూ.7,282, అహ్మదాబాద్ - రూ.7,282, జైపూర్ - రూ.7,292, లక్నో - రూ.7,292, కోయంబత్తూర్ - రూ.7,277, మదురై - రూ.7,277గా ఉన్నాయి.
వెండి విక్రయ ధరలు: భారతదేశంలోని ప్రధాన నగరాల్లో నేటి వెండి ధర కేజీక.. చెన్నై - 91,000 రూపాయలు, ముంబై - 85,900 రూపాయలు, దిల్లీ - 86,000 రూపాయలు, కోల్‌కతా - 86,000 రూపాయలు, బెంగళూరు - 83,000 రూపాయలు, హైదరాబాద్ - 91,000 రూపాయలు, కేరళ - 91,000 రూపాయలు, - 85,900 రూపాయలు, బరోడా - 86,000 రూపాయలు, అహ్మదాబాద్ - 86,000 రూపాయలు, జైపూర్ - 86,000 రూపాయలు, లక్నో - 86,000 రూపాయలు, కోయంబత్తూర్ - 91,000 రూపాయలు, మధురై - 91,000 రూపాయలుగా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications