Gold Price Today: పసిడి ప్రియులకు రేట్ల తగ్గుదల ఉపశమనం కేవలం ఒక్కరోజు ముచ్చటగా మిగిలిపోయింది. నేడు గోల్డ్ రేట్లు మళ్లీ తిరిగి పుంజుకోవటంతో చాలా మందిలో గందరగోళం కొనసాగుతోంది. రేట్ల హెచ్చుతగ్గుల్లో భారీ మార్పులను అంచనా వేయలేక కన్ఫ్యూజ్ అవుతున్నారు.
ఈ క్రమంలో 100 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే ఏకంగా రూ.4,500 పెరిగాయి. నిన్నటి రేట్ల పతనం తర్వాత మరింత తగ్గింపు కోసం వేచి చూసిన పసిడి ప్రియులకు ఇది పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.67,300, ముంబైలో రూ.66,600, దిల్లీలో రూ.66,750, కలకత్తాలో రూ.66,600, బెంగళూరులో రూ.66,600, కేరళలో రూ.66,600, జైపూరులో రూ.66,750, నాశిక్‌లో రూ.66,630, అయోధ్యలో రూ.66,750, గురుగ్రామ్‌లో రూ.66,750, నోయిడాలో రూ.66,750 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

అలాగే 24 క్యారెట్ల 100 గ్రాముల ధర నేడు రూ.4,900 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.73,420, ముంబైలో రూ.72,650, దిల్లీలో రూ.72,800, కలకత్తాలో రూ.72,650, బెంగళూరులో రూ.72,650, కేరళలో రూ.72,650, జైపూరులో రూ.72,800, నాశిక్‌లో రూ.72,680, అయోధ్యలో రూ.72,800, గురుగ్రామ్‌లో రూ.72,800, నోయిడాలో రూ.72,800గా కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.66,600గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,650 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు స్వల్పంగా రూ.100 తగ్గి రూ.86,400 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications