Gold Rate: టార్చర్ స్పెల్లింగ్ రాయిస్తున్న గోల్డ్.. నేడు రూ.4,300 పెరిగిన ధర, ఏపీ-తెలంగాణలో
Gold Price Today: దేశీయంగా కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు నేడు మళ్లీ తిరిగి పెరగటం ప్రారంభించాయి. సంక్రాంతి దగ్గరపడుతున్న వేళ చాలా మంది ముందుగానే ఆభరణాలు కొనాలనుకుంటున్నారు. చాలా చోట్ల మహిళలకు డ్వాక్రా డబ్బులు రావటంతో పాటు పంట డబ్బులు చేతికి రావటంతో ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో కొనుగోలుకు వెళ్లటానికి ముందు నేటి తాజా రిటైల్ ధరలను పరిశీలించటం ఉత్తమం.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.4,000 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7130, ముంబైలో రూ.7130, దిల్లీలో రూ.7145, కలకత్తాలో రూ.7130, బెంగళూరులో రూ.7130, కేరళలో రూ.7130, వడోదరలో రూ.7135, అహ్మదాబాదులో రూ.7135, జైపూరులో రూ.7145, లక్నోలో రూ.7145, కోయంబత్తూరులో రూ.7130, పాట్నాలో రూ.7135, నాశిక్ లో రూ.7133, మంగళూరులో రూ.7130, అయోధ్యలో రూ.7145, బళ్లారిలో రూ.7130, గురుగ్రాములో రూ.7145, నోయిడాలో రూ.7145 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ పేర్కొనబడిన ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి లేదా ఇతర వ్యాపారి లాభాలు కలపక ముందు రేట్లని అందరూ గమనించాలి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.4,500 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7778, ముంబైలో రూ.7778, దిల్లీలో రూ.7793, కలకత్తాలో రూ.7778, బెంగళూరులో రూ.7778, కేరళలో రూ.7778, వడోదరలో రూ.7783, అహ్మదాబాదులో రూ.7783, జైపూరులో రూ.7793, లక్నోలో రూ.7793, కోయంబత్తూరులో రూ.7778, పాట్నాలో రూ.7135, నాశిక్ లో రూ.7781, మంగళూరులో రూ.7778, అయోధ్యలో రూ.7793, బళ్లారిలో రూ.7778, గురుగ్రాములో రూ.7793, నోయిడాలో రూ.7793గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7130గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7778 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7130గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7778 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.99,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications