Gold Rate: గోల్డ్ రేట్ల యుద్ధం.. నేడు రూ.5,400 అప్, తెలుగు రాష్ట్రాల్లో రేట్లివే..
Gold Price Today: అంతర్జాతీయంగా అలుముకున్న యుద్ధ వాతావరణంతో పసిడి ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. గడచిన రెండు రోజులుగా చల్లారుతున్న గోల్డ్ ధరలు తిరిగి పుంజుకున్నాయి. గాంధీజయంతి రోజున దసరా షాపింగ్ కోసం వెళ్లాలని ప్లాన్ చేస్తున్న కొనుగోలుదారులు పెరిగిన రేట్లను చూసి షాక్ అవుతున్నారు. రేట్లు మరింతగా తగ్గుతాయని భావించిన దేశీయ కొనుగోలుదారులు గందరగోళానికి గురవుతున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.5,000 పెరుగుదలను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన పసిడి ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7100, ముంబైలో రూ.7100, దిల్లీలో రూ.7115, కలకత్తాలో రూ.7100, బెంగళూరులో రూ.7100, వడోదరలో రూ.7105, జైపురులో రూ.7115, మంగళూరులో రూ.7100, నాశిక్ లో రూ.7103, మైసూరులో రూ.7100, అయోధ్యలో రూ.7115, బళ్లారిలో రూ.7100, గురుగ్రాములో రూ.7115, నోయిడాలో రూ.7115 వద్ద రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ జీఎస్టీ, తరుగు, మజూరి, వ్యాపారి లాభాలు వంటి ఇతర ఖర్చులు కలపక ముందు రేట్లు పైన పేర్కొనబడ్డాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.5,400 భారీ పెరుగుదలను చూసింది. దీందో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7745, ముంబైలో రూ.7745, దిల్లీలో రూ.7760, కలకత్తాలో రూ.7745, బెంగళూరులో రూ.7745, వడోదరలో రూ.7750, జైపురులో రూ.7760, మంగళూరులో రూ.7745, నాశిక్ లో రూ.7748, మైసూరులో రూ.7745, అయోధ్యలో రూ.7760, బళ్లారిలో రూ.7745, గురుగ్రాములో రూ.7760, నోయిడాలో రూ.7760 వద్ద కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7100గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7745 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు మరియు మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications