Gold Price Today: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న వేడి పసిడి ధరల పరుగులకు పట్టం కట్టింది. ఈ క్రమంలో చాలా కాలం తర్వాత నిన్న తగ్గిన బంగారం ధర నేడు తిరిగి పుంజుకున్నాయి. నిన్న తగ్గినదానికంటే అధికంగా నేడు రేటు పెరగటం చూసి పసిడి ప్రియులు షాక్ అవుతున్నారు.
22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.5,000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేటి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే 10 గ్రాములకు.. చెన్నైలో రూ.68,900, ముంబైలో రూ.68,150, దిల్లీలో రూ.68,300, కలకత్తాలో రూ.68,150, బెంగళూరులో రూ.68,150, కేరళలో రూ.68,150, వడోదరలో రూ.68,200, జైపూరులో రూ.68,300, మంగళూరులో రూ.68,150, నాశిక్ లో రూ.67,670, మైసూరులో రూ.68,150, అయోధ్యలో రూ.68,300, గురుగ్రాములో రూ.68,300, నోయిడాలో రూ.68,300 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు 100 గ్రాములకు నిన్నటి కంటే రూ.5,400 పెరిగింది. దీంతో దేశంలోని ముఖ్యమైన నగరాల్లో పెరిగిన తాజా రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. చెన్నైలో రూ.75,160, ముంబైలో రూ.74,340, దిల్లీలో రూ.74,490, కలకత్తాలో రూ.74,340, బెంగళూరులో రూ.74,340, కేరళలో రూ.74,340, వడోదరలో రూ.74,390, జైపూరులో రూ.74,490, మంగళూరులో రూ.74,340, నాశిక్ లో రూ.74,370, మైసూరులో రూ.74,340, అయోధ్యలో రూ.74,490, గురుగ్రాములో రూ.74,490, నోయిడాలో రూ.74,490గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.68,150గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.74,340 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు స్థిరంగా రూ.90,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications