Gold Rates: ప్రస్తుతం బంగారం కళ తప్పింది. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాల కారణంగా ఫ్లాట్ గా పసిడి ట్రేడవుతోంది. దీనికి తోడు స్పాట్ మార్కెట్లలో డిమాండ్ తగ్గటం కూడా కనిపించటం ధరలపై కూడా ప్రభావం చూపుతున్నాయి.
ఈరోజు దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పసిడి ధరలు రిటైల్ మార్కెట్లో నిన్నటి ధరల వద్ద ఉన్నాయి. ఫెడ్ తాజా మానిటరీ పాలసీ మినిట్స్ విడుదల నేపథ్యంలో బంగారం ధరలు పెరగటం లేదు. ఈ క్రమంలో చెన్నైలో రూ.54,520, ముంబైలో రూ.54,150, దిల్లీలో రూ.54,300, కలకత్తాలో రూ.54,150, బెంగళూరులో రూ.54,150, వడోదరలో రూ.54,200, అహ్మదాబాదులో రూ.54,200, జైపూర్ లో రూ.54,300, కోయంబత్తూరులో రూ.54,520గా కొనసాగుతున్నాయి.

ఇక స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసిడి ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.59,450, ముంబైలో రూ.59,060, దిల్లీలో రూ.59,220, కలకత్తాలో రూ.59,060, బెంగళూరులో రూ.59,060, వడోదరలో రూ.59,120, అహ్మదాబాదులో రూ.59,120, జైపూర్ లో రూ.59,220, కోయంబత్తూరులో రూ.59,450, పూణేలో రూ.59,060, నాశిక్ లో రూ.59,090, బళ్లారిలో రూ.59,060, అమరావతిలో రూ.59,060 వద్ద ఉన్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో వెండి ధరలు మాత్రం దేశవ్యాప్తంగా స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. కిలోకు రూ.500 పెరిగి రూ.72,200గా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వెండి కేజీ ధర రూ.75,800గా కొనసాగుతోంది. ఈ వారంలో డాలర్ ఇండెక్స్‌లో అస్థిరత, ఫెడ్ మీటింగ్ నిమిషాలకు ముందు బంగారం, వెండి ధరలు అస్థిరంగానే ఉంటాయని పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ అంచనా వేశారు.


Click it and Unblock the Notifications