Gold & Silver Rates: దీపావళి గోల్డ్ సేల్స్ ఇన్ని వేల కోట్లా..! తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇలా..
Gold Rates: బంగారాన్ని ఎల్లవేళలా బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ గా భావిస్తారు భారతీయులు. పైగా పండుగలు, శుభకార్యాల సమయంలో అవసరం లేకున్నా.. ఎంతో కొంత బంగారాన్ని కొనటం సెంటిమెంట్. కరోనా తర్వాత జరుపుకున్న ఈ దీపావళిలో డిమాండ్ దాదాపు 80 శాతం పెరిగింది.

దీపావళి సేల్స్..
దేశంలో ప్రజలు దీపావళికి బంగారు ఆభరణాలను ఎక్కువగా కొంటుంటారు. ఇందులో భాగంగా అక్టోబరు 22, 23 తేదీల్లో పసిడి విక్రయాలు రూ.25 వేల కోట్లు దాటినట్లు సమచారం. ఈ రెండు రోజుల్లో ఆటోమొబైల్స్, కంప్యూటర్లు, కంప్యూటర్ సంబంధిత ఉత్పత్తులు, ఇల్లు, ఆఫీసు అలంకరణ వస్తువులు, స్వీట్ స్నాక్స్, వంట సామాగ్రి అమ్మకాలు ఏకంగా రూ.20,000 కోట్లుగా నమోదయింది. ముఖ్యంగా బంగారు నాణేలు ఎక్కువగా అమ్ముడయ్యాయని అఖిల భారత వాణిజ్య సమాఖ్య తెలిపింది.

గరిష్ఠ స్థాయికి డిమాండ్..
కరోనా తర్వాత గోల్డ్ పరిశ్రమ కోలుకుందని.. భారత్‌లో బంగారానికి డిమాండ్ గరిష్ఠ స్థాయిలో ఉన్నందున, భారతీయ బంగారు పరిశ్రమ పూర్తిగా కోలుకుందని భావిస్తున్నట్లు ఆల్ ఇండియా జువెలర్స్ అండ్ గోల్డ్ స్మిత్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు పంకజ్ అరోరా తెలిపారు.

గోల్డ్ ధరలు..(10 గ్రాములకు)
కొద్ది రోజులుగా పండుగ పరుగులు తీస్తున్న బంగారం.. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో.. 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ.51,290 వద్ద ఉంది. ఇదే సమయంలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,010గా కొనసాగుతోంది. ఇక వెండి ధర విషయానికి వస్తే కిలో ధర రూ.63,200 వద్ద లభిస్తోంది. విజయవాడలో ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.47,010 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం కొంత తక్కువగా రూ.50,680 వద్ద ఉంది. వెండి ధర కిలోకు ఢిల్లీ, ముంబైలలో తక్కువగా రూ.57,700గా ఉంది.


Click it and Unblock the Notifications