Gold Rates: బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న గోల్డ్.. కారణం ఇదే..
Gold Rates: గత వారం బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వచ్చినప్పటికీ.. మళ్లీ పెరగటం ప్రారంభించింది. అయితే అంతర్జాతీయంగా ఉన్న పరిస్థితులు గోల్డ్ ధరలను ప్రభావితం చేస్తాయి.
ఇప్పటికే బంగారం రేట్లు ఎప్పుడు తగ్గుతాయా అని భారతదేశంలోని పసిడి ప్రియులు వేచిచూస్తున్నారు. అయితే ఇప్పట్లో వారు ఊహించినట్లు ధరల తగ్గుదల ఉండకపోవచ్చని తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపును నిలిపివేయటం. ఒక వేళ రేట్ల పెంపుకు బ్రేక్ ప్రకటిస్తే అది బంగారం ధరల ర్యాలీకి కారణమౌతుందని నిపుణులు చెబుతున్నారు.

విశ్లేషకుల అంచనా ప్రకారం పసిడి ధరల్లో సానుకూల ధోరణిని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో బంగారానికి రూ.59,600-రూ.59,300 స్థాయిల వద్ద బలమైన మద్దతు ఉంటుందని వారు చెబుతున్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు బుధవారం 10 గ్రాములకు రూ.59,977 వద్ద ప్రారంభమయ్యాయి. ఇంట్రాడేలో రూ.59,960 వద్ద కనిష్ఠ స్థాయిని చేరుకున్నాయి.
ఇదే క్రమంలో కిలో వెండి ధర మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో రూ.71,883 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో రూ.71,813 వద్ద కనిష్ఠ స్థాయికి చేరుకుంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు నిలిపివేత వల్ల బంగారం త్వరలో 1,980-1,985 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా అంచనా వేశారు. ఈ క్రమంలో అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో 1,965 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర నేడు రూ.55,600 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.60,650 వద్ద ఉంది. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ.73,500గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications