బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నగరాలవారీగా కొన్ని చోట్ల ధరలు పెరిగినప్పటికీ ఓవరాల్ గా ఈ రోజు(డిసెంబర్ 7) నాటికి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయంటే..
మనదేశంలో బంగారం (Gold) ఎప్పుడూ ఒక ముఖ్యమైన సంపదగా ఉంది. ద్రవ్యోల్బణం (Inflation), మార్కెట్ అస్థిరత సమయాల్లో సంపదను కాపాడటానికి బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడిగా ఉంటూ వస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Gold Rates) తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. ఈరోజు భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని 22 క్యారెట్, 24 క్యారెట్ల బంగారం ధరల పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఈ రోజు (డిసెంబర్ 7, 2025) బంగారం ధరలు
ప్రస్తుత మార్కెట్ ట్రెండ్‌ల ప్రకారం, భారతదేశంలో Gold Rates నిన్నటి ధరలతో పోలిస్తే స్థిరంగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలు మళ్లీ ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ, దేశీయ డిమాండ్‌లో వచ్చిన పెద్దగా మార్పులు లేకపోవడం వల్ల హెచ్చుతగ్గులు లేకుండా స్థిరంగా ఉన్నాయి.
ప్రస్తుతం ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ. 13,015 ఉంది. 22 క్యారెట్ల బంగారం అయితే ఒక గ్రాముకు రూ. 11,930 ఉంది.
ప్రధాన నగరాల్లో ఇలా.
1. హైదరాబాద్ (Hyderabad)
• 24 క్యారెట్ (గ్రాము): రూ. 13,015
• 22 క్యారెట్ (గ్రాము)లు: రూ. 11,930
2. చెన్నై (Chennai)
• 24 క్యారెట్ ( గ్రాము): రూ. 13,135
• 22 క్యారెట్ (గ్రాము): రూ.12,040
3. ముంబై (Mumbai)
• 24 క్యారెట్ ( గ్రాము): రూ. 13,015
• 22 క్యారెట్ (గ్రాము): రూ. 11,930
4. ఢిల్లీ (Delhi)
• 24 క్యారెట్ ( గ్రాము): రూ. 13,030
• 22 క్యారెట్ (గ్రాము): రూ. 11,945
5. బెంగళూరు (Bangalore)
• 24 క్యారెట్ ( గ్రాము): రూ.13,015
• 22 క్యారెట్ (గ్రాము): రూ. 11,930
వెండి ధరలు ఇలా..
ఇక వెండి ధరల విషయానికొస్తే ప్రస్తుతం వెండి ధరలు కూడా బంగారంలాగానే స్థిరంగా ఉన్నాయి. గత వారం రోజుల నుంచి వెండి ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నా ప్రస్తుతం మాత్రం స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఒక గ్రాము వెండి ధర రూ. 199 గా ఉంది. అన్ని ప్రధాన నగరాల్లో కేజీ వెండి ధర రూ.1,99,000 ఉంది.
పెట్టుబడి పెట్టొచ్చా?
పైన పేర్కొన్న వివరాల ప్రకారం Gold Rates స్థిరంగా ఉన్నప్పటికీ.. వచ్చే ఎడాది పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారులకు బంగారం ఎప్పుడూ సురక్షితమైన ఆస్తిగానే ఉంది. ఇది మార్కెట్ ప్రమాదాల నుండి మీ సంపదను రక్షించడంలో సహాయపడుతుంది. మీరు ఫిజికల్ గోల్డ్ (Physical Gold) లేదా గోల్డ్ బాండ్‌లు (Sovereign Gold Bonds), గోల్డ్ ETFల (Gold ETFs) ద్వారా కూడా పెట్టుబడి పెట్టవచ్చు. మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా సరైన పెట్టుబడి మార్గాన్ని ఎంచుకోవడం ముఖ్యం.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు, కారణం ఏంటంటే..

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!



Click it and Unblock the Notifications