Gold Price: గడచిన 10 రోజులుగా బంగారం, వెండి ధరల్లో పెద్ద పెరుగుదల నమోదైంది. మార్చి 7న బులియన్ మార్కెట్‌లో బంగారం ధర 10 గ్రాములకు రూ.65,049 స్థాయికి రిటైల్ మార్కెట్లో చేరుకుంది. ఇది ఆల్ టైమ్ హై.
ఈ కాలంలో బంగారం ధర రూ.3,041 మేర పెరిగింది. అలాగే గత 10 ట్రేడింగ్ రోజుల్లో వెండి మరింత బలంగా మారింది. వెండి ధర రూ.2,374 మేర పెరిగింది. బంగారం, వెండి ధరలు ఇలా పెరగడానికి కారణం పెళ్లిళ్ల సీజన్ కాదు. 2024 ఫిబ్రవరి 23న 10 గ్రాముల బంగారం ధర రూ.62,008గా ఉంది. IBJA విడుదల చేసిన రేట్ల ప్రకారం గురువారం బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,049 వద్ద ప్రారంభమై రూ.64,955 వద్ద ముగియగా, వెండి కేజీ ధర రూ.72,265 వద్ద ఉంది. దీనికి ముందు ఫిబ్రవరి 23న కిలో వెండి ధర రూ.69,653గా ఉంది.

ఈ బంగారం, వెండి ధరలను ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(IBJA) జారీ చేసింది. ఈ రేటుపై GST, ఆభరణాల తయారీ ఛార్జీలు వర్తించవు. కేడియా కమోడిటీస్ ప్రెసిడెంట్ అజయ్ కేడియా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడానికి గల కారణాలను వివరిస్తూ.. Comex, MCXలో బంగారం ధరలు కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయన్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధానంలో ఊహించిన మార్పు కారణంగా బంగారం ధరల్లో తాజా పెరుగుదల వచ్చింది.
ద్రవ్యోల్బణం ఉన్నప్పటికీ.. బంగారంపై భారతీయుల ప్రేమ తగ్గడం లేదు. ఏకంగా రూ.8,008 కోట్ల విలువైన సావరిన్ బంగారు బాండ్లను కొనుగోలు చేశారు. ఇప్పటికే.. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్-హమాస్ మధ్య సైనిక వివాదం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిని పెంచిందని కెడియా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తోంది. చైనా పౌరులు కూడా ద్రవ్యోల్బణం, దేశంలో కల్లోలభరితమైన స్టాక్ మార్కెట్, రియల్టీ రంగం వల్ల బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి కారణాలతో బంగారం ధరలు గరిష్ఠాలకు చేరుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications