Gold Rate: రెండో రోజూ పైపైకి గోల్డ్ రేటు.. రూ.8000కు చేరువలో పసిడి, కొనటం కష్టమే..
Gold Price Today: ప్రపంచవ్యాప్తంగా మిడిల్ ఈస్ట్ యుద్ధ భయాలు పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు గోల్డ్ రేట్లు మళ్లీ పెరుగుదలను చూశాయి. ప్రస్తుతం ధర గరిష్ఠాల వద్ద ఉండగా రానున్న మరికొద్ది రోజుల్లో ఇది గ్రాముకు రూ.8వేల మార్కును చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో పండుగ షాపింగ్ చేయాలని చూస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం వేడి బంగారం, వెండి ధరలను సైతం పైపైకి తీసుకెళుతోంది.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు మరో రూ.1000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7110, ముంబైలో రూ.7110, దిల్లీలో రూ.7125, కలకత్తాలో రూ.7110, బెంగళూరులో రూ.7110, కేరళలో రూ.7110, వడోదరలో రూ.7115, జైపూరులో రూ.7125, మంగళూరులో రూ.7110, నాశిక్ లో రూ.7113, మైసూరులో రూ.7110, అయోధ్యలో రూ.7125, బెంగళూరులో రూ.7110, నోయిడాలో రూ.7125, గురుగ్రాములో రూ.7125 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే నేడు రూ.1100 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7756, ముంబైలో రూ.7756, దిల్లీలో రూ.7771, కలకత్తాలో రూ.7756, బెంగళూరులో రూ.7756, కేరళలో రూ.7756, వడోదరలో రూ.7761, జైపూరులో రూ.7771, మంగళూరులో రూ.7756, నాశిక్ లో రూ.7759, మైసూరులో రూ.7756, అయోధ్యలో రూ.7771, బెంగళూరులో రూ.7756, నోయిడాలో రూ.7771, గురుగ్రాములో రూ.7771గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7110గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7756 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు మరియు మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications