Gold Rate: కుబేరులనే వణికిస్తున్న గోల్డ్ రేటు.. శనివారం రూ.8,200 అప్, ఏపీ-తెలంగాణ రేట్లివే..

Gold Price Today: యూఎస్ ఫెడరల్ రిజర్వు తన వడ్డీ రేట్లను తగ్గించిన నాటి నుంచి అనూహ్యంగా పసిడి ధరలు ధనవంతులకు సైతం దూరమవుతున్నాయి. ఇప్పటి వరకు సామాన్య మధ్యతరగతి పెరుగుతున్న రేట్లతో ఆందోళన చెందగా, ఇది ధనికులకు సైతం అందని ద్రాక్షగా మారుతోంది. దీంతో దీపావళి, దసరా కోసం వారాంతంలో షాపింగ్ చేయాలనుకున్న ప్రజలు వాటిని విరమించుకుంటున్నారు.

22 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే ఏకంగా 100 గ్రాములకు రూ.7,500 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వినిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.6960, ముంబైలో రూ.6960, దిల్లీలో రూ.6975, కలకత్తాలో రూ.6960, బెంగళూరులో రూ.6960, కేరళలో రూ.6960, వడోదరలో రూ.6965, మంగళూరులో రూ.6960, నాశిక్ లో రూ.6963, అయోధ్యలో రూ.6975, బళ్లారిలో రూ.6960, గురుగ్రాములో రూ.6975, నోయిడాలో రూ.6975 వద్ద కొనసాగుతున్నాయి.

Gold rates shocking rich people too after fed rate cuts know AP TS latest rates

ఇదే క్రమంలో దేశంలో నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు 24 క్యారెట్ల పసిడి ధర ఏకంగా రూ.8,200 భారీ పెరుగుదల నమోదైంది. దీంతో వివిధ ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ విక్రయ ధరలను చూస్తే... గ్రాముకు చెన్నైలో రూ.7593, ముంబైలో రూ.7593, దిల్లీలో రూ.7608, కలకత్తాలో రూ.7593, బెంగళూరులో రూ.7593, కేరళలో రూ.7593, వడోదరలో రూ.7598, మంగళూరులో రూ.7593, నాశిక్ లో రూ.7598, అయోధ్యలో రూ.7608, బళ్లారిలో రూ.7593, గురుగ్రాములో రూ.7608, నోయిడాలో రూ.7608గా ఉన్నాయి.

ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6960గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7593 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.500 పెరిగి రూ.98,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఆర్థిక ఆరోగ్యం, స్థిరత్వాన్ని కొనసాగించే క్రమంలో.. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల పసిడి కొనుగోళ్లు ప్రస్తుత ధరల పెరుగుదలకు కీలక కారణం కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పసిడి డిమాండ్ పెరగడం, ముఖ్యంగా ఆర్థిక అస్థిరతలు లేదా మునుపటి కంటే ఎక్కువ రిస్క్ ఉన్న సమయంలో ధరలను ప్రభావితం చేస్తుంది. కేంద్ర బ్యాంకులు తమ ఆర్థిక విధానాలను సానుకూలంగా మార్చినప్పుడు, గోల్డ్ హోల్డింగ్స్ ఎక్కువగా ఉండటాన్ని భద్రతగా భావించి, భారీగా కొత్త నిల్వలు పెంచుతుంటాయి. ఇది పరోక్షంగా మార్కెట్లలో ధరల పెరుగుదలకు దారితీస్తుంటాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+