Gold Price Today: అక్షయతృతీయ తర్వాత మూడు రోజులు వరుసగా పతనమైన పసిడి ధరలు మే 15 నుంచి మళ్లీ రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. అమెరికా నుంచి వడ్డీ రేట్లపై సానుకూల ప్రకటనకు తోడు ద్రవ్యోల్బణం గణాంకాలతో డాలర్ బలహీనపడటంతో పసిడి ధరల పరుగులు కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.7000 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన 10 గ్రాముల గోల్డ్ రేట్లను గమనిస్తే.. చెన్నైలో రూ.67,950, ముంబైలో రూ.67,850, దిల్లీలో రూ.68,000, కలకత్తాలో రూ.67,850, బెంగళూరులో రూ.67,850, కేరళలో రూ.67,850, పూణేలో రూ.67,850, వడోదరలో రూ.67,900, జైపూరులో రూ.68,000, నాశిక్ లో రూ.67,880, అయోధ్యలో రూ.68,000, గురుగ్రాములో రూ.68,000, నోయిడాలో రూ.68,000, బళ్లారిలో రూ.67,850 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటి కంటే 100 గ్రాములకు రూ.7,700 మేర పెరిగాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రేట్లు 10 గ్రాములకు పరిశీలిస్తే.. చెన్నైలో రూ.74,130, ముంబైలో రూ.74,020, దిల్లీలో రూ.74,170, కలకత్తాలో రూ.74,020, బెంగళూరులో రూ.74,020, కేరళలో రూ.74,020, పూణేలో రూ.74,020, వడోదరలో రూ.74,070, జైపూరులో రూ.74,170, నాశిక్ లో రూ.74,050, అయోధ్యలో రూ.74,170, గురుగ్రాములో రూ.74,170, నోయిడాలో రూ.74,170, బళ్లారిలో రూ.74,020గా కొనసాగుతున్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.67,850గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.74,020 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,500 పెరిగి రూ.92,500 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications