Gold Rate: సామాన్యులకు అందనంత ఎత్తుకు గోల్డ్.. రెండు వారాలుగా నో బ్రేక్, నేడు రూ.1,100 అప్
Gold Price Today: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టడానికి కేవలం 4 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ క్రమంలో పసిడి ధరలు నిరంతరాయంగా పెరుగుతూనే ఉన్నాయి. జనవరి 1 నుంచి పసిడి పరుగులు భారతీయ మధ్యతరగతికి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇకపై గోల్డ్ కొనుగోలు కలగానే మారుతుందా అనే అనుమానాలు రేకెత్తిస్తోంది.
గోల్డ్ రేట్లు బీభత్సం.. పెరుగుదలకు కారణాలు..?
ట్రంప్ విధానాలు రాబోయే కాలంలో అమలు మార్కెట్లపై పెద్ద ప్రభావాన్ని చూపనుంది. దీంతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరిగితే బంగారం తీవ్ర ఆందోళన నుంచి ప్రయోజనం పొందవచ్చు. ఈ పరిస్థితులు రిటైల్ వినియోగదారులకు ఆందోళనకరమైన అంశంగా ఉంది. అయితే పెట్టుబడులు పెట్టేవారికి గోల్డ్ ఈ కాలంలో కొంత లాభాలను అందించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే పసిడి ధరల పెరుగుదలకు ముఖ్య కారణం అమెరికాలో కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్ ప్రభుత్వం ఎకనమిక్ పాలసీలపై అంచనాలు పసిడి ధరలను పెంచుతోంది.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1,000 పెరుగుదలను చూసింది. వాస్తవానికి నిన్న బ్రేక్ తీసుకున్న ధరల పెరుగుదల నేడు తిరిగి పుంజుకోవటంతో పండుగల జోరు సంతోషం ఆవిరయ్యింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7340, ముంబైలో రూ.7340, దిల్లీలో రూ.7355, కలకత్తాలో రూ.7340, బెంగళూరులో రూ.7340, కేరళలో రూ.7340, వడోదరలో రూ.7345, జైపూరులో రూ.7355, లక్నోలో రూ.7355, మంగళూరులో రూ.7340, నాశిక్ లో రూ.7332, అయోధ్యలో రూ.7355, నోయిడాలో రూ.7355, గురుగ్రాములో రూ.7355 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధరలను పరిశీలిస్తే.. 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే ధర రూ.1100 పెరిగింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8007, ముంబైలో రూ.8007, దిల్లీలో రూ.8022, కలకత్తాలో రూ.8007, బెంగళూరులో రూ.8007, కేరళలో రూ.8007, వడోదరలో రూ.8012, జైపూరులో రూ.8022, లక్నోలో రూ.8022, మంగళూరులో రూ.8007, నాశిక్ లో రూ.7998, అయోధ్యలో రూ.8022, నోయిడాలో రూ.8022, గురుగ్రాములో రూ.8022గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7340గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8007 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7340గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8007 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1000 పెరిగి రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications