Gold Price Today: వామ్మో బంగారం ఇలా పెరుగుతుందేంటి..?? ఏపీ, తెలంగాణ తాజా రేట్లు..
Gold Price Today: గత కొద్ది రోజులుగా స్వల్ప ఊరటను అందించిన బంగారం ధర మళ్లీ భగభగమంటోంది. రిటైల్ విక్రయాల డిమాండ్ అంతగా పెరగటనప్పటికీ పసిడి ధరలు మాత్రం భారీగానే పెరుగుతున్నాయి.
నిన్నటితో పోల్చితే 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.250 మేర పెరిగింది. దీంతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. చెన్నైలో రూ.55,200, ముంబైలో రూ.54,700, దిల్లీలో రూ.54,850, కలకత్తాలో రూ.54,700, బెంగళూరులో రూ.54,700, కేరళలో రూ.54,700, వడోదరలో రూ.54,750, జైపూర్ లో రూ.54,850, కోయంబత్తూరులో రూ.55,200, సూరత్ లో రూ.54,750, నాశిక్ లో రూ.54,730, మైసూరులో రూ.54,700 చొప్పున విక్రయాలు జరుగుతున్నాయి.

అలాగే 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.270 చొప్పున పెరిగింది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,220, ముంబైలో రూ.59,670, దిల్లీలో రూ.59,820, కలకత్తాలో రూ.59,670, బెంగళూరులో రూ.59,670, కేరళలో రూ.59,670, వడోదరలో రూ.59,720, జైపూర్ లో రూ.59,820, కోయంబత్తూరులో రూ.60,220, సూరత్ లో రూ.59,720, నాశిక్ లో రూ.59,700, మైసూరులో రూ.59,670 వద్ద ఉన్నాయి.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి, నెల్లూరు, కాకినాడలలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.54,700గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,670 వద్ద ఉన్నాయి. తెలంగాణలోని హైదరాబాదు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో 22 క్యారెట్ల బంగారం రేటు రూ.54,700గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,670గా కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలను పరిశీలిస్తే కిలోకు రూ.200 పెరిగిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.80,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications