Gold Rate: మకర సంక్రాంతికి మండిపోతున్న గోల్డ్ ధర.. రూ.1,700 పెరిగిన పసిడి, ఇక చాలు సామీ..
Gold Price Today: 2025 ప్రారంభం నుంచి పసిడి ధరలు బ్రేకు లేకుండా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మకర సంక్రాంతి దగ్గరపడిన వేళ వారాంతంలో చాలా మంది షాపింగ్ చేసేందుకు వెళుతున్నారు. గతవారం రోజుల్లో 24 క్యారెట్ల పసిడి 100 గ్రాముల ధర రూ.9,400 పెరగగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.8,600 పెరుగుదలను చూడటంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు గందరగోళంలో ఉన్నారు.
అసలు గోల్డ్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయ్..?
ముందుగా రిటైల్ గోల్డ్ ధరల పెరుగుదలకు కీలక కారణం చైనా, ఇండియా వంటి సెంట్రల్ బ్యాంకులు నిరంతరం చేపడుతున్న పసిడి కొనుగోళ్లు ధరలను పెంచుతున్నాయి. అలాగే పన్నులు, భౌగోళిక రాజకీయ అంశాలపై త్వరలో బాధ్యతలు చేపట్టనున్న యూఎస్ కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలు అమెరికా డాలర్‌ను బలపరిచగా, బంగారం లాభాలను తగ్గించాయి. నిపుణుల తాజా అంచనాల ప్రకారం 24 క్యారెట్ల పసిడి ధర త్వరలోనే 10 గ్రాములకు రూ.76,500 వరకు చేరుకోవచ్చని అంచనా వేయబడింది. మరిన్ని కారణాలు కూడా ధరలను పెంచుతున్నాయి.

ఈ క్రమంలో 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7300, ముంబైలో రూ.7300, దిల్లీలో రూ.7315, కలకత్తాలో రూ.7300, బెంగళూరులో రూ.7300, కేరళలో రూ.7300, పూణేలో రూ.7300, అహ్మదాబాదులో రూ.7305, జైపూరులో రూ.7301, లక్నోలో రూ.7301, కోయంబత్తూరులో రూ.7286, మధురైలో రూ.7286, నాశిక్ లో రూ.7289, మైసూరులో రూ.7286, అయోధ్యలో రూ.7301, బళ్లారిలో రూ.7286, గురుగ్రాములో రూ.7301, నోయిడాలో రూ.7301 వద్ద నేడు విక్రయాలు కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.1700 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ తాజా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.7964, ముంబైలో రూ.7964, దిల్లీలో రూ.7980, కలకత్తాలో రూ.7964, బెంగళూరులో రూ.7964, కేరళలో రూ.7964, పూణేలో రూ.7964, అహ్మదాబాదులో రూ.7970, జైపూరులో రూ.7963, లక్నోలో రూ.7963, కోయంబత్తూరులో రూ.7948, మధురైలో రూ.7948, నాశిక్ లో రూ.7951, మైసూరులో రూ.7948, అయోధ్యలో రూ.7963, బళ్లారిలో రూ.7948, గురుగ్రాములో రూ.7963, నోయిడాలో రూ.7963గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7946 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7300గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7946 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,01,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications