Gold Rate Today: రోజులు గడుస్తున్న కొద్ది గోల్డ్ రేట్లు కొండెక్కి కూర్చుంటున్నాయి. అంతర్జాతీయంగా పసిడికి డిమాండ్ పుంజుకోవటంతో బంగారం ర్యాలీ కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇది కొనుగోలుదారులు త్వరపడాల్సిన సమయంగా పేర్కొంటున్నారు.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటి కంటే 10 గ్రాములకు రూ.100 పెరుగుదలను నమోదు చేశాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.59,000, ముంబైలో రూ.58,500, దిల్లీలో రూ.58,650, కలకత్తాలో రూ.58,500, కేరళలో రూ.58,500, వడోదరలో రూ.58,550, జైపూరులో రూ.58,650, లక్నోలో రూ.58,650, మధురైలో రూ.59,000, మంగళూరులో రూ.58,500, నాశిక్‌లో రూ.58,530, మైసూరులో రూ.58,500 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధరలను పరిశీలిస్తే నిన్నటి కంటే రూ.110 మేర పెరిగాయి. దీంతో ముఖ్యమైన వివిధ నగరాల్లో విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.64,360, ముంబైలో రూ.63,820, దిల్లీలో రూ.63,960, కలకత్తాలో రూ.63,820, కేరళలో రూ.63,820, వడోదరలో రూ.63,860, జైపూరులో రూ.63,960, లక్నోలో రూ.63,960, మధురైలో రూ.64,360, మంగళూరులో రూ.63,820, నాశిక్‌లో రూ.63,850, మైసూరులో రూ.63,820గా ఉన్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని నగరాలైన విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, తిరుపతి, విశాఖ, అనంతపురం, కడప, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.58,500గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,820గా కొనసాగుతోంది. ఇదే క్రమంలో ఏపీ, తెలంగాణలో వెండి ధరలను పరిశీలిస్తే.. నేడు కేజీకి రూ.300 తగ్గిన తర్వాత రిటైల్ రేటు రూ.80,700గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications