Gold Price Today: గేరు మార్చని బంగారం.. రేటు తెలియక మోసపోకండి..??
Gold Price Today: అంతర్జాతీయ పరిణామాలు, కొనుగోలు డిమాండ్ వంటి అనేక కారణాలతో రోజూ బులియన్ మార్కెట్లలో పసిడి ధరలు మారిపోతుంటాయి. అయితే చాలా మంది తమ నగరాల్లో రిటైల్ ధరలు తెలియక వ్యాపారుల చేతిలో మోసపోతుంటారు.
నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరలు నిన్నటి కంటే రూ.100 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్లో శ్రావణమాసం, వినాయకచవితి, పండుగలు, పెళ్లిళ్ల వంటి శుభకార్యాల కారణంగా బంగారం రేటు క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో తాజా రేట్లను పరిగణిస్తే.. చెన్నైలో రూ.55,600, ముంబైలో రూ.55,300, దిల్లీలో రూ.55,450, కలకత్తాలో రూ.55,300, బెంగళూరులో రూ.55,300, కేరళలో రూ.55,300, వడోదరలో రూ.55,350, అహ్మదాబాదులో రూ.55,350, లక్నోలో రూ.55,450, జైపూర్ లో రూ.55,450, కోయంబత్తూరులో రూ.55,600, నాశిక్ లో రూ.55,230గా కొనసాగుతున్నాయి.

24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాములకు రూ.100 పెరిగిన తర్వాత దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,650, ముంబైలో రూ.60,320, దిల్లీలో రూ.60,470, కలకత్తాలో రూ.60,320, బెంగళూరులో రూ.60,320, కేరళలో రూ.60,320, వడోదరలో రూ.60,370, అహ్మదాబాదులో రూ.60,370, లక్నోలో రూ.60,470, జైపూర్ లో రూ.60,470, కోయంబత్తూరులో రూ.60,650, నాశిక్ లో రూ.60,370 వద్ద ఉన్నాయి.
ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, కాకినాడ, విశాఖపట్నం, హైదరాబాదు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ లలో నేడు 10 గ్రాముల బంగారం ధర రూ.55,300గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.60,320 వద్ద కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధరలను పరిశీలిస్తే.. స్థిరంగా కిలో రేటు రూ.80,000గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications