Gold Price Today: బంగారం రివర్స్ గేర్ వేసింది.. రేటు చూసి షాపింగ్‌కి వెళ్లండి..
Gold Price Today: వారాంతంలో చాలా మంది బంగారం కొనుగోలు చేసేందుకు ఆభరణాల దుకాణాలకు క్యూ కడుతున్నారు. ప్రధానంగా పెళ్లిళ్లు, పండుగల, శుభకార్యాల సీజన్ దగ్గర పడటంతో చాలా మంది షాపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బంగారం ధరలు తప్పక తెలుసుకోవాల్సిందే.
నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరను పరిశీలిస్తే నిన్నటి కంటే రూ.150 మేర పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ నగరాల్లోని రిటైల్ విక్రయ ధరలు చూస్తే.. చెన్నైలో రూ.55,550, ముంబైలో రూ.55,200, దిల్లీలో రూ.55,350, కలకత్తాలో రూ.55,200, బెంగళూరులో రూ.55,200, కేరళలో రూ.55,200, పూణేలో రూ.55,200, వడోదరలో రూ.55,250, జైపూర్ లో రూ.55,350, మధురైలో రూ.55,550, పాట్నాలో రూ.55,250, నాశిక్ లో రూ.55,230గా ఉన్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర 10 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.170 పెరుగుదలను నమోదు చేసింది. వివిధ ప్రాంతాల్లో రిటైల్ రేట్లను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,490, ముంబైలో రూ.60,220, దిల్లీలో రూ.60,370, కలకత్తాలో రూ.60,220, బెంగళూరులో రూ.60,220, కేరళలో రూ.60,220, పూణేలో రూ.60,220, వడోదరలో రూ.60,270, జైపూర్ లో రూ.60,370, మధురైలో రూ.60,490, పాట్నాలో రూ.60,270, నాశిక్ లో రూ.60,250గా కొనసాగుతున్నాయి.
తెలుగు రాష్ట్రల్లోని ధరలను పరిశీలిస్తే.. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, అనంతపురం, నెల్లూరు, తిరుపతి, హైదరాబాదు, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజాంబాద్ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు నేడు రూ.55,200 వద్ద రిటైల్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు గమనిస్తే రూ.60,220గా ఉంది. ఇక వెండి ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కేజీకి రూ.200 తగ్గిన తర్వాత రూ.80,000గా కొనసాగుతున్నాయి.


Click it and Unblock the Notifications