Gold Price Today: గతవారం పసిడి ధరలు కొంత తగ్గినప్పటికీ భారీ పెరుగుదలను సైతం నమోదు చేశాయి. ఈ క్రమంలో పెళ్లిళ్లతో పాటు ఉగాదికి ముందు బంగారం, వెండి ఆభరణాలను కొనుగోలు చేయాలనుకుంటున్న వ్యక్తులు ప్రస్తుత రేట్ల పెరుగుదలతో కొంత ఆందోళనకు గురవుతున్నారు. నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే రూ.1000 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8050, ముంబైలో రూ.8050, దిల్లీలో రూ.8065, కలకత్తాలో రూ.8050, బెంగళూరులో రూ.8050, కేరళలో రూ.8050, వడోదరలో రూ.8055, అహ్మదాబాదులో రూ.8055, జైపూరులో రూ.8065, లక్నోలో రూ.8065, మంగళూరులో రూ.8050, నాశిక్ లో రూ.8053, అయోధ్యలో రూ.8065, బళ్లారిలో రూ.8050, గురుగ్రాములో రూ.8065, నోయిడాలో రూ.8065 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటి కంటే 100 గ్రాములకు ఏకంగా రూ.1100 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన పసిడి రిటైల్ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8782, ముంబైలో రూ.8782, దిల్లీలో రూ.8797, కలకత్తాలో రూ.8782, బెంగళూరులో రూ.8782, కేరళలో రూ.8782, వడోదరలో రూ.8787, అహ్మదాబాదులో రూ.8787, జైపూరులో రూ.8797, లక్నోలో రూ.8797, మంగళూరులో రూ.8782, నాశిక్ లో రూ.8785, అయోధ్యలో రూ.8797, బళ్లారిలో రూ.8782, గురుగ్రాములో రూ.8797, నోయిడాలో రూ.8797 గా ఉన్నాయి.
మెుత్తం మీద ఈవారంలో కూడా బంగారం ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. నిపుణుల అంచనాల ప్రకారం పసిడి ధర ఔన్సుకు 3000 డాలర్లకు చేరుకోవచ్చని అంచనాలు ఉన్నాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో కూడా గోల్డ్ భారీగా ధర పెరుగుతూ భవిష్యత్తు ధరలపై క్లారిటీ వస్తోంది.
తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.8050గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8782 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.100 తగ్గి రూ.1,08,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications