Gold Rate Today: యూఎస్ సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాల మధ్య ప్రస్తుతం బంగారం ధరలు మూడు నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. దీనికి తోడు ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారుల గందరగోళాల మధ్య బంగారం ధర రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
వరుసగా రెండో రోజు కూడా భారతీయ పసిడి ప్రియులకు పెరిగిన రేట్లు షాక్ ఇస్తున్నాయి. ఈ క్రమంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటి కంటే రూ.250 పెరుగుదలను నమోదు చేసింది. దేశంలోని ప్రముఖ నగరాల్లో తాజా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.60,400, ముంబైలో రూ.59,700, దిల్లీలో రూ.59,850, కలకత్తాలో రూ.59,700, బెంగళూరులో రూ.59,700, కేరళలో రూ.59,700, జైపూరులో రూ.59,850, లక్నోలో రూ.59,850, అయోధ్యలో రూ.59,850, నోయిడాలో రూ.59,850, బళ్లారిలో రూ.59,700, గురుగ్రాములో రూ.59,850గా కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు నిన్నటి కంటే రూ.280 పెరిగాయి. వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.65,890, ముంబైలో రూ.65,130, దిల్లీలో రూ.65,280, కలకత్తాలో రూ.65,130, బెంగళూరులో రూ.65,130, కేరళలో రూ.65,130, జైపూరులో రూ.65,280, లక్నోలో రూ.65,280, అయోధ్యలో రూ.65,280, నోయిడాలో రూ.65,280, బళ్లారిలో రూ.65,130, గురుగ్రాములో రూ.65,280గా ఉన్నాయి.
ఏపీ, తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, విశాఖ, నెల్లూరు, కడప, అనంతపురం, కాకినాడ, తిరుపతి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.59,700, ఇలాగే 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.65,130గా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెండి రిటైల్ విక్రయ ధర కేజీకి రూ.200 తగ్గి రూ.78,000గా కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications