Gold Rate: వామ్మో.. కోటీశ్వరులకూ దూరంగా గోల్డ్.. రెండో రోజు రూ.2,200 పెరిగిన పసిడి..!
Gold Price Today: వారాంతం దగ్గరపడుతున్న వేళ గోల్డ్ రేట్లు సరికొత్త గరిష్ఠాలకు పెరుగుతూ సాగుతున్నాయి. దసరా తర్వాత స్వల్పంగా తగ్గిన గోల్డ్ తిరిగి భారీ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. దీంతో పెళ్లిళ్లు, దీపావళి షాపింగ్ చేయాలని చూస్తున్న ప్రజలకు పెద్ద షాక్ తగిలింది. దీనికి తోడు నిరంతరంగా పెరుగుతూపోతున్న పసిడి ధరలు ధనికులను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ రేట్లలో కొనటం కష్టమేనని సగటు భారతీయ గోల్డ్ లవర్ ఆందోళన చెందుతున్నాడు.
22 క్యారెట్ల పసిడి ధరలు నేటి పెరుగుదల తర్వాత 100 గ్రాములకు రూ.2000 పెరుగుదలను చూశాయి. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7160, ముంబైలో రూ.7160, దిల్లీలో రూ.7175, కలకత్తాలో రూ.7160, బెంగళూరులో రూ.7160, కేరళలో రూ.7160, వడోదరలో రూ.7165, జైపూరులో రూ.7175, లక్నోలో రూ.7175, మంగళూరులో రూ.7160, నాశిక్ లో రూ.7163, అయోధ్యలో రూ.7175, బళ్లారిలో రూ.7160, గురుగ్రాములో రూ.7175, నోయిడాలో రూ.7175 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.2,200 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రస్తుతం పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7811, ముంబైలో రూ.7811, దిల్లీలో రూ.7826, కలకత్తాలో రూ.7811, బెంగళూరులో రూ.7811, కేరళలో రూ.7811, వడోదరలో రూ.7816, జైపూరులో రూ.7826, లక్నోలో రూ.7826, మంగళూరులో రూ.7811, నాశిక్ లో రూ.7163, అయోధ్యలో రూ.7826, బళ్లారిలో రూ.7814, గురుగ్రాములో రూ.7826, నోయిడాలో రూ.7826గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7160గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7811 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7160గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7811 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,03,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు ఒక కారణంగా నిలిచాయి. భౌగోళిక రాజకీయ అస్థిరత సమయంలో బంగారం తరచుగా సురక్షితమైన ఆస్తిగా కనిపిస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు. ఈ పరిస్థితులు పసిడి ధరను పెంచుతారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, విస్తృత ఆర్థిక పరిస్థితులు వంటి ఇతర అంశాలు కూడా బంగారం ధరల కదలికలో పాత్ర పోషిస్తాయి. మీకు బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఉంటే వార్తలు, మార్కెట్ ట్రెండ్స్ రెండింటినీ గమనిస్తూ ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications