సాధారణంగా భారతీయ కుటుంబాలలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంగారం (Gold) అనేది ఆపదలో ఆదుకునే ఆస్తిగానే కాదు. దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా కూడా. అయితే 2025 కొత్త సంవత్సరం ప్రారంభంలో బంగారంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్న వారికి ఈ ఏడాదిలో ఊహించని లాభాలు వచ్చాయి. ఒకవేళ మీరు 2025 సంవత్సరం ఆరంభంలో రూ. 1 లక్షను బంగారంలో (Gold Investment) పెట్టి ఉంటే.. ఈ రోజు మీ సంపద ఎంత పెరిగిందో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

2025 ప్రారంభంలో బంగారం ధర ఎలా ఉంది?
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం భయాలు , కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు కారణంగా 2024 చివరి నుండే బంగారం ధరలు (Gold Rates) పెరగడం మొదలుపెట్టాయి. 2025 జనవరి 1వ తేదీన 10 గ్రాముల స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 75,000 గా ఉంది.
రూ. 1 లక్ష పెట్టి ఉంటే..
మీరు 2025 జనవరి 1న రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే, ఆ రోజు ధర ప్రకారం మీరు సుమారు 13.33 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని (Gold) కొనుగోలు చేసి ఉండేవారు . అయితే ఇప్పుడు ఆ విలువ ఎంత మేరకు పెరిగిందో లెక్క వేసి చూద్దాం.
2025 డిసెంబర్‌లో మీ పెట్టుబడి విలువ..
ప్రస్తుతం 2025 డిసెంబర్ నాటికి, బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి. కేవలం 12 నెలల్లో బంగారం ధరలు ఊహించని విధంగా పెరిగాయి. ప్రస్తుత మార్కెట్ నివేదికల ప్రకారం.. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,30,000 ను తాకింది . అంటే 1 గ్రాము బంగారం ధర ఇప్పుడు రూ. 13,000. మీ రూ. 1 లక్ష పెట్టుబడి ప్రస్తుత విలువ ఏకంగా రూ. 1,73,290. అంటే సుమారు 73% రాబడి. మీరు 2025 మొదట్లో పెట్టిన రూ. 1,00,000 పెట్టుబడి, ఏడాది తిరిగే సరికి రూ. 1,73,290 గా పెరిగింది.
ఊహించని లాభం..
సాధారణంగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు లేదా సంప్రదాయ పెట్టుబడులు 6% నుంచి 10% మధ్య రాబడిని అందిస్తాయి. కానీ, బంగారం (Gold Investment) కేవలం ఒక సంవత్సరంలోనే 70% కంటే ఎక్కువ రాబడిని ఇచ్చి, మరే ఇతర పెట్టుబడి సాధనం ఇవ్వని అద్భుతమైన లాభాన్ని చూపింది. బంగారంలో పెట్టుబడి పెట్టడం ద్వారా కేవలం ఒక సంవత్సరంలోనే మీరు రెట్టింపు కంటే ఎక్కువ రాబడిని పొందగలిగారు. ఇది బంగారం ఎంత వేగంగా సంపదను సృష్టించగలదో స్పష్టం చేస్తుంది.
జాగ్రత్తలు ముఖ్యం
2025లో బంగారంలో పెట్టుబడి పెట్టినవాళ్లు నిజంగ అదృష్టవంతులనే చెప్పాలి. అయితే ఈ ట్రెండ్ ఇలాగే ఉండాలని రూల్ లేదు. వచ్చే ఏడాది ధరలు పెరిగినా.. ఈ స్థాయిలో పెరగకపోవచ్చు. ఏదేమైనా బంగారం అనేది ఎల్లప్పుడూ దీర్ఘకాలికంగా సంపదను కాపాడే ముఖ్యమైన ఆస్తి. అయితే పెట్టుబడి పెట్టే ముందు మార్కెట్ పరిస్థితులను , నిపుణుల సలహాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..

Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 2, గురువారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..



Click it and Unblock the Notifications