Gold Rate: ట్రంప్ గెలుపుతో పసిడి పరుగు.. మూడు రోజుల తగ్గాక రూ.1100 పెరిగిన గోల్డ్..!
Gold Price Today: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ఈక్విటీ మార్కెట్ల నుంచి గోల్డ్, బాండ్స్, క్రిప్టో కరెన్సీల వరకు ఉంది. ప్రస్తుతం హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల సమరంలో ట్రంప్ విజయానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న వేళ పసిడి ధరలు సైతం స్వల్ప పెరుగుదలను చూశాయి. ఈ క్రమంలో భారతీయ స్టాక్ మార్కెట్లు సైతం లాభాలతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1000 పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7365, ముంబైలో రూ.7365, దిల్లీలో రూ.7380, కలకత్తాలో రూ.7365, బెంగళూరులో రూ.7365, కేరళలో రూ.7365, వడోదరలో రూ.7370, అహ్మదాబాదులో రూ.7370, జైపూరులో రూ.7380, కోయంబత్తూరులో రూ.7365, మంగళూరులో రూ.7365, నాశిక్ లో రూ.7368, మైసూరులో రూ.7365, అయోధ్యలో రూ.7380, బళ్లారిలో రూ.7365, గురుగ్రాములో రూ.7380, నోయిడాలో రూ.7380 వద్ద కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటితో పోల్చితే 100 గ్రాములతో పోల్చితే నేడు 1100 రూపాయల పెరుగుదలను చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన గోల్డ్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8035, ముంబైలో రూ.8035, దిల్లీలో రూ.8050, కలకత్తాలో రూ.8035, బెంగళూరులో రూ.8035, కేరళలో రూ.8035, వడోదరలో రూ.8040, అహ్మదాబాదులో రూ.8040, జైపూరులో రూ.8050, కోయంబత్తూరులో రూ.8035, మంగళూరులో రూ.8035, నాశిక్ లో రూ.8038, మైసూరులో రూ.8035, అయోధ్యలో రూ.8050, బళ్లారిలో రూ.8035, గురుగ్రాములో రూ.8050, నోయిడాలో రూ.8050గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7365గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8035 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7365గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8035 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,05,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications