Gold Rate: గోల్డ్ కొనటం ఇక కలే ఫ్రెండ్స్.. ట్రంప్ రాకతో బుల్లెట్ వేగంలో పసిడి, నేటి రిటైల్ ధరలివే..
Gold Price Today: జనవరి 1, 2025 నుంచి పసిడి ధరలు అనూహ్యంగా పెరుగుదలను చూస్తున్నాయి. ఈ క్రమంలో గోల్డ్ కొనాలని భావిస్తున్న చాలా మంది కొంత గందరగోళానికి గురవుతున్నారు. అయితే 2025లో పసిడి ధరలకు అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే ప్రశ్నలు కొనసాగుతున్నాయి. గత ఏడాది పసిడి 20 శాతానికి పైగా రాబడిని అందించిన తర్వాత ప్రస్తుతం పరిస్థితులు మారిపోతున్నాయి.
జనవరి 21, 2025లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు డొనాల్డ్ ట్రంప్. అయితే వైట్ హౌస్‌కి ఎంట్రీతో గ్లోబల్ ట్రేడ్ టెన్షన్లు పెరుగుతాయని.. దీనికి తోడు పెరుగుతున్న జియో పొలిటికల్ ఆందోళనలు గోల్డ్ రేట్ల పెంపుకు ఆజ్యం పోస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది పెట్టుబడుల రూపంలో గోల్డ్ బార్లు, గోల్డ్ బిస్కెట్లు హోల్డ్ చేస్తున్న వ్యక్తులకు మంచి సమయంగా పరిగణించవచ్చని వారు భావిస్తున్నారు. అయితే మరో పక్క రిటైల్ అవసరాల కోసం గోల్డ్ కొనుగోలు చేసే వ్యక్తులు దీని వల్ల అధిక ధరల భారాన్ని మోయాల్సి ఉంటుందని వారు భావిస్తున్నారు. అయితే పెరిగే అనిశ్చిత పరిస్థితులకు అనుగుణంగా పసిడిపై పెట్టుబడులను సురక్షితమైనవిగా అందరూ భావించటమే ధరల పెరుగుదలకు కారణంగా వారు చెబుతున్నారు.

2025లో భారతీయ స్టాక్ మార్కెట్లు వృద్ధిని సాధించటంలో అడ్డంకులు ఎదుర్కొంటాయని దానికి కారణం బలపడుతున్న యూఎస్ డాలర్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రిప్టోలకు పెరుగుతున్న ఆదరణలుగా నిపుణులు అంచనా వేస్తున్న వేళ చాలా మంది విలువైన లోహాలపై పెట్టుబడి కొనసాగించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 1, 2025 నుంచి గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు ఇండియాలో నిరంతరాయంగా పెరుగుతూనే ఉన్నాయి. కేవలం నాలుగు రోజుల్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర గ్రాముకు రూ.150 వరకు పెరుగుదలను చూసింది. దీంతో సంక్రాంతితో పాటు పెళ్లిళ్లకు అవసరమైన షాపింగ్ చేయాలనుకుంటున్న ప్రజలు నిరంతరాయంగా పెరుగుతున్న రేట్లతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.7215గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7871 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7215గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7871 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.99,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications