Gold Price Today: రోజులు మారుతున్నా పసిడి ధరలు మాత్రం చల్లారటం లేదు. నిరంతరాయంగా పెరుగుతూపోతున్న ధరలతో సామాన్యులు గోల్డ్ కొనటం కలగా మారుతోందని అంటున్నారు. వరుసగా పెరుగుతున్న ధరలను చూసి ధనవంతులు సైతం గందరగోళానికి గురవుతున్నారు. ఈ క్రమంలో నేడు పెరిగిన రిటైల్ ధరలను గమనించాకే కొనుగోలు చేయండి.
గోల్డ్ రేట్ల ర్యాలీ ఎందుకు..?
ప్రస్తుతం పెరుగుతున్న పసిడి ధరలు దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. వాస్తవానికి అమెరికా తాజా ట్రేడ్ టారిఫ్స్ కారణంగా ముందస్తు వ్యూహాత్మక రక్షణ చర్యల్లో భాగంగా చైనా నుంచి పసిడి డిమాండ్ పెరగటంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు సరికొత్త రికార్డు స్థాయిలకు చేరుకున్నాయి. ప్రస్తుతం చైనా-యూఎస్ ట్రేడ్ వార్ కారణంగా అప్రమత్తమైన ప్రపంచ దేశాల నుంచి కూడా పసిడికి డిమాండ్ పెరుగుతోంది. దీనికి అదనంగా అమెరికా జాబ్ డేటా, ద్రవ్యోల్బణం, నెమ్మదిగా కొనసాగుతున్న ఆర్థిక వ్యవస్థ వంటి ఇతర కారణాలు సైతం పసిడి పరుగుకు కారణంగా ఉన్నాయి.

22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.3500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన గోల్డ్ విక్రయ రిటైల్ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.7980, ముంబైలో రూ.7980, దిల్లీలో రూ.7995, కలకత్తాలో రూ.7980, బెంగళూరులో రూ.7980, కేరళలో రూ.7980, పూణేలో రూ.7980, వడోదరలో రూ.7985, జైపూరులో రూ.7995, లక్నోలో రూ.7995, కోయంబత్తూరులో రూ.7980, మంగళూరులో రూ.7980, నాశిక్ లో రూ.7983, మైసూరులో రూ.7980, అయోధ్యలో రూ.7995, బళ్లారిలో రూ.7980, నోయిడాలో రూ.7995, గురుగ్రాములో రూ.7995 వద్ద కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.3900 భారీ పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన పసిడి రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8706, ముంబైలో రూ.8706, దిల్లీలో రూ.8721, కలకత్తాలో రూ.8706, బెంగళూరులో రూ.8706, కేరళలో రూ.8706, పూణేలో రూ.8706, వడోదరలో రూ.8711, జైపూరులో రూ.8721, లక్నోలో రూ.8721, కోయంబత్తూరులో రూ.8706, మంగళూరులో రూ.8706, నాశిక్ లో రూ.8709, మైసూరులో రూ.8706, అయోధ్యలో రూ.8721, బళ్లారిలో రూ.8706, నోయిడాలో రూ.8721, గురుగ్రాములో రూ.8721 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ధరలు జీఎస్టీ, తరుగు, మజూరి, వ్యాపారి లాభాలు వంటివి కలపకముందువిగా గుర్తుంచుకోవాలి.
ఈవారంలో కూడా బంగారం, వెండి ధరల అధిక ఒడిదొడుకులను చూస్తాయని భావిస్తున్నట్లు పృథ్వీఫిన్‌మార్ట్ కమోడిటీ రీసెర్చ్‌కు చెందిన మనోజ్ కుమార్ జైన్ పేర్కొన్నారు. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే నిర్ణయాల ప్రభావం ఎలా ఉండనుందనే ఆందోళనలు అస్థిరతకు కారణమని వెల్లడించారు. ఇదే క్రమంలో డొనాల్డ్ ట్రంప్ ఇనాగరల్ స్పీచ్ సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు చాలా అధిక ఓలటాలిటీకి గురైంది. రానున్న రోజుల్లో ఉక్రెయిన్-రష్యాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగితే పసిడికి డిమాండ్ తగ్గించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణలోని నగరాలైన హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.7980గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.8706 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.1,07,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications