Gold Rate: శుభవార్త.. యూఏఈ, ఖతార్, ఒమన్ కంటే తక్కువ ధరకే బంగారం.. ఇండియన్స్ లక్కీ ఛాన్స్
Gold News Today: భారతదేశంలో గడచిన వారం రోజులుగా పసిడి ధరలు వరుసగా క్షీణతను చూడటం పసిడి ప్రియుల్లో కొత్త జోష్ నింపుతోంది. దీంతో ధరలు పెరగకముందే తమ షాపింగ్ చేయాలని చాలా మంది భావిస్తూ వారాంతంలో షాపులకు క్యూ కడుతున్నారు. సంక్రాతితో పాటు పెళ్లిళ్లు, శుభకార్యాలకు సైతం ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేయాలని చాలా మంది చూస్తున్నారు.
అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే వచ్చింది. వరుసగా గోల్డ్ రేట్లు పడిపోవటంతో భారదేశంలోని గోల్డ్ ధరలు చాలా దేశాల్లో కంటే తక్కువకే అందుబాటులో ఉన్నాయని తేలింది. అవును యూఏఈ, ఖతార్, ఓమన్, సింగపూర్ కంటే ఇండియాలోనే ప్రస్తుతం గోల్డ్ తక్కువ ధరలకు లభిస్తోంది. భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.75,650గా ఉంది. 22 క్యారెట్ల వేరియంట్ 10 గ్రాములకు రూ.69,350కి పడిపోగా.. 18 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు రూ.56,740 వద్ద ఉంది. అయితే ఇదే సమయంలో ఒమన్‌లో బంగారం ధర ఒక్కసారిగా పెరిగి 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.75,763 వద్ద ఉంది. ఇక ఖతార్‌లో 24 క్యారెట్ల రేటు రూ.76,293కి పెరిగింది.

పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇజ్రాయెల్- గాజా చుట్టూ, ప్రాంతీయ అస్థిరత ప్రభావం పసిడిపై క్లియర్ గా కనిపిస్తోంది. అక్కడి ప్రజలు ప్రస్తుతం సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం కొనుగోలుకు మక్కువ చూపటంతో డిమాండ్‌ను పెంచింది. భారతదేశంలో డిమాండ్ పుంజుకోవడంతో ఈ ధర వ్యత్యాసం మరింత పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు 3 ఏళ్ల కాలంలో ఒక్క వారంలోనే భారీ పతనాన్ని కలిగి నమోదు చేశాయి.
యూఎస్ స్పాట్ మార్కెట్లో ధరలు 4.5 శాతం తగ్గగా ఔన్స్ ధర రెండు నెలల కనిష్ఠమైన 2,563.25 డాలర్లకు పడిపోయింది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ రేటు తగ్గింపుపై హెచ్చరిక వైఖరిని అవలంబించడానికి దారితీసింది. దీంతో బంగారం ధరలు ఒత్తిడిని చూస్తున్నాయి. పైగా ట్రంప్ రాకతో డాలర్ అన్ని కరెన్సీలను తిరిగి డామినేట్ చేయటం ప్రారంభించింది. ప్రస్తుతం అందరి చూపు ఫెడ్ డిసెంబర్ ద్రవ్య విధానంపై కొనసాగుతోంది.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర రూ.6935గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7565 వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6935గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7565 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి రూ.1500 తగ్గి నేడు రూ.99,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
దేశంలో వరుస పండుగల తర్వాత దీర్ఘకాలంగా ఉన్న పెళ్లిళ్ల సీజన్ కావటంతో చాలా మంది ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు జనవరిలో రానున్న సంక్రాంతి కోసం కూడా చాలా మంది ఇప్పటి నుంచే గోల్డ్, సిల్వర్ షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది నిన్న భారీ ధరల పతనంతో ఆలస్యం చేయకుండా షాపింగ్ కి వెళ్లాలని చూస్తున్నారు. అలాంటి వారు ముందుగా నేటి రిటైల్ మార్కెట్లో ధరలను గమనించివెళ్లటం మంచిది.


Click it and Unblock the Notifications