రూ.33 వేలకు పైగా తగ్గిన బంగారం ధర, ఇంకా తగ్గే రోజు దగ్గర్లోనే, అక్టోబర్ 22, బుధవారం ధరలు ఇవే..

కొద్ది నెలలుగా భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. పసిడి ధరలు పతనం కావడానికి కారణాలను మనం చూసినట్లయితే యూఎస్‌-చైనా మధ్య కొనసాగుతున్న టారిఫ్‌ యుద్ధం నేపథ్యంలో సానుకూల చర్చలు జరుగుతున్నాయని మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్‌ ఇండెక్స్‌ విలువ పెరగడం, అలాగే యూఎస్‌ ప్రభుత్వ షట్‌డౌన్‌ భయాలు వంటి అంశాలు పసిడి, వెండి సహా విలువైన లోహాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని బులియన్‌ వ్యాపారులు పేర్కొన్నారు.

ఇదే సమయంలో వచ్చే వారం యూఎస్‌ అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు మధ్య జరగనున్న సమావేశం మార్కెట్‌ అంచనాల్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించగలదని నిపుణులు భావిస్తున్నారు. ఈ సమావేశం ఫలితాలు టారిఫ్‌ యుద్ధం ఉద్రిక్తతలను తగ్గిస్తే, బంగారం ధరలు మళ్లీ బలపడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Gold market news bullion prices trade optimism impact global gold rates gold investment gold prices today market risk sentiment gold and trade talks falling gold prices gold demand decline precious metals update financial market news - 2025 10 2025

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా పసిడి, వెండి ఈటీఎఫ్‌లలో ఇన్వెస్టర్ల నుంచి భారీ స్థాయిలో పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. ఈ పెరుగుదలతో విలువైన లోహాల మార్కెట్లో గట్టి ర్యాలీ నమోదైందని బులియన్‌ వర్గాలు వెల్లడించాయి. అయితే, టెక్నికల్‌గా మార్కెట్‌ ఓవర్‌బాట్‌ (Overbought) స్థితికి చేరడంతో, అనేకమంది ట్రేడర్లు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణలో భాగంగా అమ్మకాలు చేపడుతున్నారని నిపుణులు పేర్కొన్నారు.

ఈ లాభాల బుకింగ్‌ చర్యల ఫలితంగా Gold, వెండి ధరల్లో స్వల్ప కరెక్షన్‌ (Correction) చోటుచేసుకుంటున్నట్లు విశ్లేషకులు తెలిపారు. విశ్లేషకుల అంచనాల ప్రకారం, రాబోయే వారాల్లో యూఎస్‌-చైనా చర్చల ఫలితాలు, డాలర్‌ బలపడటం మరియు గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సెంటిమెంట్‌ విలువైన లోహాల భవిష్యత్‌ దిశను నిర్ణయించే అవకాశం ఉంది.

అక్టోబర్ 22, బుధవారం దేశంలో Gold ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.338 తగ్గి రూ.12,720 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.310 తగ్గి 11,660 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.254 తగ్గి రూ.9,540 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.33,800 తగ్గి రూ. రూ.12,72,000 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ.31,000 తగ్గి రూ. 11,66,000 వద్ద ట్రేడ్ అవుతోంది. 18 క్యారట్ల బంగారం ధర 100 గ్రాములు రూ. 25,400 తగ్గి రూ.9,54,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలిస్తే.. 10 గ్రాముల 24 క్యారట్ల Gold ధర రూ.3,380 తగ్గి రూ.1,27,200 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.3,100 తగ్గి రూ.1,16,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.2,540 తగ్గి రూ.95,400 గా నమోదైంది.

విజయవాడలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.3,380 తగ్గి రూ.1,27,200 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.3,100 తగ్గి రూ.1,16,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.2,540 తగ్గి రూ.95,400 గా నమోదైంది.

చెన్నైలో బంగారం ధరలను చూసినట్లయితే 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,27,420 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,16 ,800 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.96,000 గా నమోదైంది.

ముంబైలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.3,380 తగ్గి రూ.1,27,200 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.3,100 తగ్గి రూ.1,16,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.2,540 తగ్గి రూ.95,400 గా నమోదైంది.

ఇక ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,27,350 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.1,16,750 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.95,550 గా నమోదైంది.

మీ ఏరియాలో బంగారం ధరలు తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి తెలుసుకోవచ్చు

ఇక అహమ్మదాబాద్ లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,27,250 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల Gold ధర రూ.1,16,650 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.95,450 గా నమోదైంది.

బెంగుళూరులో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.3,380 తగ్గి రూ.1,27,200 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.3,100 తగ్గి రూ.1,16,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.2,540 తగ్గి రూ.95,400 గా నమోదైంది.

కలకత్తా విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.3,380 తగ్గి రూ.1,27,200 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.3,100 తగ్గి రూ.1,16,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.2,540 తగ్గి రూ.95,400 గా నమోదైంది.

విశాఖపట్నం విషయానికి వస్తే..10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.3,380 తగ్గి రూ.1,27,200 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర రూ.3,100 తగ్గి రూ.1,16,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారట్ల బంగారం ధర రూ.2,540 తగ్గి రూ.95,400 గా నమోదైంది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+