Gold Price Today, June 5: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయే కాని తగ్గడం లేదు. నేటి ధరలను చూస్తే మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,170గా నమోదైంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,900 గా నమోదైంది. ఇక వెండి ధర విషయానికి వస్తే కిలో లక్ష దాటింది. MCXలో పసిఢి ధర 0.33 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.98,255 వద్ద ట్రేడవుతోంది.
ఇదే సమయంలో వెండి ధర కూడా 0.18 శాతం పెరిగి కిలోకు రూ.1,01,477 వద్ద ఉదయం ట్రేడవుతోంది. ఇక ముంబైలో అయితే వెండి ధర కిలోకు రూ.2,000 పెరిగి రూ.1,04,000కి చేరుకుంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు విషయానికి వస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 99,180 వద్ద ట్రేడ్ అవుతోంది.ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90,910 వద్ద ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 74,390గా ఉంది.ఏపీలో విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు ఉన్నాయి.

బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితితో కూడిన పరిస్థితుల వల్ల బంగారం ధరలు ప్రధానంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు గత వారం యూఎస్ మార్కెట్లో స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూశాయి. దీంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు ఉండటంతో ఇన్వస్టర్లంతా స్టాక్ మార్కెట్ నుండి తమ పెట్టుబడులను విత్ డ్రా చేసుకుని పసిడిలో పెట్టారు. దీంతో బంగారానికి ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడి పెరగడం ప్రారంభించింది. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి సుంకాలు, పన్నులు, మారకపు రేట్లలో హెచ్చుతగ్గులు భారతదేశంలో బంగారం ధరలను విపరీతంగా ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలు దేశవ్యాప్తంగా రోజువారీ బంగారం ధరలను నిర్ణయిస్తాయి.
ఇక ఈ మధ్య కాలంలో పెరిగిన రష్యా, ఉక్రెయిన్ ఉద్రిక్తతలు కూడా బంగారం పెరగడానికి కారణం అవుతున్నాయి. ఇక పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ సైతం పాలస్తీనా మీద కాలు దువ్వుతోంది. దీని ప్రభావం బంగారం మీద పడింది. దీంతో పసిడి ధరలు నింగినంటాయి. ప్రస్తుతం బంగారం ధర లక్షను తాకుతోంది. దేశీయంగా పరిస్థితులు సాధారణంగానే ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు అంతగా అనుకూలించడం లేదు. దీని వల్లే బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వివాహాది శుభకార్యాలకు లేదా ఇతర కార్యాలకు బంగారాన్ని కొనాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పసిడి కొనాలంటే చాలా మొత్తంలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈయూ దేశాలపై విధించిన సుంకాల ప్రభావం కూడా బంగారంపై పడింది.దీంతో పాటు యుఎస్-చైనా చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. అవి ఓ కొలిక్కి రావడం లేదు. ఈ నేపథ్యంలో బంగారం ధరలపై ఈ వాణిజ్య సంబంధాలు తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలా ఉంటే..బ్రోకరేజ్ హౌస్ క్వాంట్ మ్యూచువల్ ఫండ్ నివేదిక పసిడి ప్రియులకు శుభవార్తను అందించింది. ఈ నివేదిక ప్రకారం.. బంగారం ధరలు రాబోయే రెండు నెలల్లో 12-15% తగ్గవచ్చని తెలిపింది.
దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ( 22K బంగారం (ప్రతి 10 గ్రాములు), 24K బంగారం (ప్రతి 10 గ్రాములు) వరుసగా..
ఢిల్లీ రూ. 91,450 రూ. 99,750
జైపూర్ రూ. 91,450 రూ. 99,750
అహ్మదాబాద్ రూ. 91,350 రూ. 99,650
పాట్నా రూ. 91,350 రూ. 99,650
ముంబై రూ. 91,300 రూ. 99,600
హైదరాబాద్ రూ. 91,300 రూ. 99,600
చెన్నై రూ. 91,300 రూ. 99,600
బెంగళూరు రూ. 91,300 రూ. 99,600
కోల్‌కతా రూ. 91,300 రూ. 99,600
పుదుచ్చెరి- రూ. 99,180, రూ.90,910
సూరత్- రూ. 99,230, రూ.90,960
కోయంబత్తూర్- రూ. 99,180, రూ.90,910
భోపాల్- రూ. 99,230, రూ.90,960
పుణె- రూ.99,180, రూ.90,910
వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 1,13,100 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ. 100 పెరిగి. రూ.1,02,100గా నమోదైంది. ముంబైలో కిలో వెండికి రూ. 100 పెరిగి. రూ.1,02,100 వద్ద ట్రేడ్ అవ్వగా...విజయవాడలో కేజీ ధర రూ.1,13,100గా ఉంది. విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 1,13,100 వద్ద కొనసాగుతోంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..

బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!



Click it and Unblock the Notifications