ఈ ఏడాది బంగారం ధరలు పసిడి ప్రియులకు కాస్త నిరాశను కలిగించాయి. జనవరి-మార్చి మధ్య కాలంలో 24 క్యారెట్ల బంగారం ధర ఆకాశాన్ని తాకుతూ వచ్చింది. ఏప్రిల్, మే నెలలో అయితే ఏకంగా లక్ష రూపాయలకు ఎగబాకింది. బంగారం కొనాలనుకునే సామాన్యులకు ఈ ధరలు చుక్కలు చూపించాయి. ఇక భారత్- పాకిస్తాన్ మధ్య యుధ్ద వాతావరణంగా పసిడి ధరలు స్పల్పంగా తగ్గముఖం పట్టాయి. లక్ష నుంచి 96 వేలకు దిగివచ్చింది బంగారం ధర. అయితే మళ్లీ బంగారం ధర ఈ రోజు కొంచెం తగ్గింది. శుక్రవారంతో పోలిస్తే శనివారం బంగారం ధర తగ్గి కొనుగోలుదారులకు ఊరట కల్పించింది.
హైదరాబాద్ నగరంలో (Gold rates in Hyderabad) తులం బంగారం ధర రూ.89,800 (22 క్యారెట్స్), రూ.97,970 (24 క్యారెట్స్) వద్ద ట్రేడ్ అవుతోంది. శుక్రవారం ధరతో పోలిస్తే ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర వరుసగా రూ.1500, రూ.1630 తగ్గింది.ఇక విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఇవే రేట్లు ఉన్నాయి. చెన్నైలో శనివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ.1500, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1630 తగ్గింది. ప్రస్తుతం చెన్నైలో గోల్డ్ రేటు రూ.89,800 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్), రూ.97,970 (24 క్యారెట్స్ 10 గ్రామ్ గోల్డ్) వద్ద ట్రేడ్ అవుతోంది.

ఇక ఢిల్లీలో ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్స్ పసిడి ధర రూ.1500 దిగి రూ.89,950కు చేరుకోగా.. 24 క్యారెట్ల ధర రూ.1630 తగ్గి రూ.98,120 పలుకుతోంది. బంగారం ధరలు శనివారం తగ్గినా వెండి ధరలు(Silver Price) మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి రేటు రూ.1,18,000 వద్ద స్థిరంగా ఉంది.ప్రస్తుతం రూ. 98 వేల దగ్గర ట్రేడ్ అవుతున్న ధర రాబోయే రోజుల్లో లక్ష రూపాయల మార్క్ ను దాటే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. గత కొన్ని వారాలుగా పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు దాదాపు రూ. 90,000 మరియు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు దాదాపు రూ. 1,00,000 వరకు ఉన్నాయి.అయితే బంగారం ధరలు ప్రతి క్షణం మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనుగోలుదారులు ఇచ్చిన సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పేర్కొన్న ధరలు నిన్నటి ముగింపు ధరలు అయితే నేటి ధర తగ్గుదలతో లేదా పెరుగుదలతో ప్రారంభమవుతుంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.


Click it and Unblock the Notifications