Glod Rate 2030: దాదాపు 5 వారాలుగా బంగారం ధరలు ప్రపంచ వ్యాప్తంగా మండిపోతున్నాయి. ప్రజలు ఎన్నడూ చూడని స్థాయిలకు పసిడి ధరలు పెరగటంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 2024 మెుదటి త్రైమాసికంలో గోల్డ్ రేటు 13 శాతం ర్యాలీని నమోదు చేసింది.
CNBCలో ఇటీవల జరిగిన సంభాషణలో విఘ్నహర్త గోల్డ్ చైర్మన్ మహేంద్ర లూనియా మాట్లాడుతూ 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.1.68 లక్షలకు చేరుకోవచ్చని తన అంచనాలను వ్యక్తం చేశారు. ఈ లెక్కన ఒక్కో గ్రాము ధర రూ.16,800కి చేరుకుంటుందనే వార్త భారతీయ పసిడి ప్రియులను పెద్ద షాక్‌కి గురిచేసింది. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం, యుద్ధ వాతావరణంతో పాటు ఇతర కారణాలు ఉన్నప్పటికీ ప్రస్తుతం చైనా నుంచి అధిక కొనుగోళ్లతో పసిడి ధరలు జెట్ స్పీడుతో పెరుగుతున్నాయి.

ప్రస్తుతం మార్కెట్లలో సాగుతున్న అస్థిరతలను గమనిస్తే స్వల్ప కాలంలో గోల్డ్ రేటు తగ్గుతుందని ఆశించలేమని నిపుణులు చెబుతున్నారు. అయితే దీనికి బదులుగా బంగారంలో పెట్టుబడులు పెట్టడం ఉత్తమంగా వారు చెబుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి సంపద విలువ కోల్పోకుండా చాలా మంది బంగారాన్ని వినియోగిస్తారు. అందువల్ల చాలా మంది ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా పసిడి వైపు తమ డబ్బును బదిలీ చేస్తున్నారు. నిపుణులు సైతం తమ మెుత్తం పెట్టుబడుల్లో 10 శాతాన్ని గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లకు కేటాయించాలని సిఫార్సు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సమయంలో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సావరిన్ గోల్డ్ బాండ్ ప్లాన్ (SGB) మంచి ఎంపికగా పరిగణించబడుతుంది. ఇది వడ్డీ ఆదాయాన్ని కూడా ఇన్వెస్టర్లకు అందిస్తోంది. ఏడాదికి అనేక సార్లు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వేలం ద్వారా SGBలను కొనుగోలు చేయవచ్చు. పాన్ కార్డ్ కలిగిన వ్యక్తులు వీటిని బ్యాంకులు, పోస్టాఫీసులు లేదా స్టాక్‌బ్రోకింగ్ సంస్థల నుంచి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ బాండ్లు ప్రతి యూనిట్ ఒక గ్రాము స్వచ్ఛమైన బంగారం విలువైనది. ఒక వ్యక్తి గరిష్ఠంగా 4 కిలోగ్రాముల విలువైన SGBలను, ట్రస్ట్‌లు గరిష్ఠంగా 20 కిలోగ్రాముల వరకు గోల్డ్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు. బంగారం ధరలకు ఆశాజనకంగా ఉన్న ఔట్‌లుక్‌ను దృష్టిలో ఉంచుకుని.. రానున్న 4-5 సంవత్సరాల పాటు బంగారంపై పెట్టుబడి పెట్టడం మంచి ఆలోచనని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications